Farmers Protest: ఘాజీపూర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భారీగా మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్.. తగ్గేది లేదంటున్న రైతులు
Farmers Protest: జనవరి 26న ఘటనల నేపథ్యంలో రైతు సంఘాలపై కేంద్ర ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులను వెంటనే

Farmers Protest: జనవరి 26న ఘటనల నేపథ్యంలో రైతు సంఘాలపై కేంద్ర ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులను వెంటనే ఖాళీ చేయాలని పోలీసులు ఒత్తిడి పెంచారు.ఆ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 133 ప్రకారం రైతులకు నోటీసులు జారీ చేశారు. కాగా, ఘాజీపూర్ దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు. దాంతో ఘాజీపూర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఘాజీపూర్‌ను ఖాళీ చేసేది లేదని రైతు సంఘాల నాయకులు తేల్చి చెబుతున్నారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే ఉరేసుకుంటామని రైతులు అధికారులను హెచ్చరిస్తున్నారు. రైతులపై దాడియొచేద్దని రైతుసంఘం నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు రైతులను ఘాజీపూర్ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగాయి.
Also read:
ఆ మసీదులో నమాజ్ చేసినా పాపమే.. మసీదు నిర్మాణానికి ఎవరూ నయా పైసా ఇవ్వొద్దన్న అసదుద్దీన్ ఒవైసీ
అంతరిక్షంలోకి ప్రయాణించాలనుకుంటున్నారా… టికెట్ కొనడానికి రూ.400కోట్లు సిద్ధం చేసుకోండి..?