AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Minister Grand Daughter Murder: పట్టపగలు కేంద్ర మంత్రి మనుమరాలు దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనుమరాలు సుష్మా దేవి (32) బుధవారం దారుణ హత్యకు గురైంది. ఆమెను ఆమె భర్త రమేశ్ సింగ్ కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని గయ జిల్లాలోని అత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెటువా గ్రామంలో బుధవారం (ఏప్రల్ 9) చోటు చేసుకుంది..

Union Minister Grand Daughter Murder: పట్టపగలు కేంద్ర మంత్రి మనుమరాలు దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
Union Minister Grand Daughter Murder Case
Srilakshmi C
|

Updated on: Apr 09, 2025 | 8:31 PM

Share

గయా, ఏప్రిల్ 9: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనుమరాలు సుష్మా దేవి (32) బుధవారం దారుణ హత్యకు గురైంది. ఆమెను ఆమె భర్త రమేశ్ సింగ్ కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని గయ జిల్లాలోని అత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెటువా గ్రామంలో బుధవారం (ఏప్రల్ 9) చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందింతుడు రమేశ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలు సుష్మాదేవి అటారీ బ్లాక్‌లో వికాస్ మిత్రాగా పని చేస్తున్నారు. బీహార్ మహాదళిత్ వికాస్ మిషన్ కింద అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఆమె విధులు నిర్వహిస్తుంది. ట్రక్ డ్రైవర్ అయిన రమేష్ సింగ్‌తో 14 సంవత్సరాల క్రితం సుష్మాదేవికి కులాంతర వివాహం జరిగింది. అయితే గత కొంత కాలంగా ఈ జంట కాపురంలో కలతలు ప్రారంభమైనాయి. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ బుధవారం ఇంటికి వచ్చిన రమేష్.. భార్య సుష్మను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి గొళ్లెం పెట్టాడు. ఆ తర్వాత ఆమె ఛాతీపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. హత్య అనంతరం రమేష్‌ అక్కడి నుంచి పరారైనాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని FSL, సాంకేతిక సెల్ సహాయంతో తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. నిందితుడు రమేష్‌పై కేసు నమోదు చేశామని, త్వరలో అరెస్టు చేస్తామని గయ SSP ఆనంద్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం మగధ్ మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రికి పంపినట్లు ఆయన తెలిపారు. సుష్మపై అనుమానం పెంచుకున్న రమేష్‌.. అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చిన రమేష్‌ తన సోదరిని గదిలో బంధించి కాల్చి చంని, పారిపోయాడని, అతనికి కఠిన శిక్ష విధించాలని మృతురాలి సోదరి పూనమ్ కుమారి మీడియాకు తెలిపారు. అయితే ఈ సంఘటన వెనుక గల కారణాన్ని పోలీసులు ఇంకా స్పష్టం చేయలేదు. మృతురాలు సుష్మ కృత్ మాంఝీ కుమార్తె. సత్యేంద్ర కుమార్ పన్నా బంధువు, మాంఝీ మేనల్లుడు అని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.