AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021: కస్టమ్ డ్యూటీ పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం.. వేటిపై ప్రభావం పడనుందంటే..

Government May Increase Custom Duty: కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌పై యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైన సమయంలో రానున్న..

Budget 2021: కస్టమ్ డ్యూటీ పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం.. వేటిపై ప్రభావం పడనుందంటే..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 31, 2021 | 7:03 PM

Share

Government May Increase Custom Duty: కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌పై యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైన సమయంలో రానున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరి దృష్టి పడింది. దీంతో నిర్మాల సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఎలాంటి అంశాలు ఉంటాయన్నదానిపై సర్వత్ర ఉత్కంఠనెలకొంది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ సమర్పించనున్న బడ్జెట్‌లో ప్రభుత్వం కస్టమ్ డ్యూటీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేంద్రం కస్టడీ డ్యూటీని పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రతిపాదనలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

కస్టమ్ డ్యూటీ వేటిపై పెరిగే అవకాశముందంటే..

ఈ విషయమై శరతుల్ అమర్‌చంద్ మంగల్‌దాస్ అండ్ కో భాగస్వామి అయిన రజత్ బోస్ మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై కస్టమ్ సుంకాన్ని పెంచుతూ వస్తోంది. అయితే దిగుమతులపై ఇది ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తాజాగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ వంటి రంగాల్లో ఉపయోగించే ముడి పదార్థాలపై ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పెంచే అవకాశాలున్నట్లు రజత్ బోస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read: Budget 2021: ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. బడ్జెట్‌లో వెల్లడించే అవకాశం