Budget 2021: ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. బడ్జెట్‌లో వెల్లడించే అవకాశం
Budget 2021: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఫిబ్రవరి 1న...

Budget 2021: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో వెల్లడించే అవకాశం ఉందని తెలిపింది. బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇందులో నాలుగు కంపెనీల ప్రైవేటీకరణ, ఒక మెగా ఐపీవో ఉండవచ్చని తెలుస్తోంది.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్ వైజాగ్ స్టీల్) వ్యూహాత్మక విక్రయానికి సంబంధించి అంశాన్ని కూడా కేబినెట్‌లో పరిశీలించినట్లు సమాచారం. ఈ వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంది. ఎల్‌ఐసీ తొలి పబ్లిక్ ఆఫర్ ఉంటుందని, గత బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి రూ.2.1 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని వెల్లడించారు. అయితే కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి. భారత్ పెట్రోలింయం, కంటైనర్ కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్‌ల ప్రవేటీకరణకు 2019 నవంబర్‌లో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎయిర్ ఇండియాతో పాటు ఈ కంపెనీల ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుంది.
Also Read: పేపర్ లెస్ బడ్జెట్ సామాన్యులు తెలుసుకునేలా కేంద్రం కొత్త యాప్.. ఇందులోని ప్రత్యేకతలు ఇవే..