AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాగు చట్టాలపై ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ కీలక వ్యాఖ్యలు.. ఆదాయం పెరుగుతుంది కానీ..

Geetha Gopinath Coments: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలపై ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ కీలక

సాగు చట్టాలపై ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ కీలక వ్యాఖ్యలు.. ఆదాయం పెరుగుతుంది కానీ..
uppula Raju
|

Updated on: Jan 28, 2021 | 5:02 AM

Share

Geetha Gopinath Coments: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలపై ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాల వల్ల రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని కానీ వీటి వల్ల ప్రభావితమయ్యే రైతులకు సామాజిక రక్షణలు కల్పించాలని సూచించారు.  కొత్త చట్టాలు ప్రధానంగా మార్కెటింగ్‌ ఆధారంగా రూపొందించారని, వీటి వల్ల కొత్త మార్కెట్లలో ఉన్న అవకాశాల్ని ఒడిసిపట్టుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.

మండీలతో పాటు ఇతర కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎలాంటి పన్ను చెల్లించే అవసరం లేకుండా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం చట్టాలు కల్పిస్తున్నాయన్నారు. దీనివల్ల అన్నదాతల ఆదాయం తప్పకుండా పెరుగుతుందన్నారు. అయితే, కొత్త సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. వాటివల్ల ప్రభావితమయ్యే వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై రైతు సంఘాలు, కేంద్రం మధ్య 11 విడతలుగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయినా ఎలాంటి ఫలితం తేలలేదు. ఈ క్రమంలో రెండు సంవత్సరాల వరకు చట్టాల అమలును నిలిపివేస్తామని ఈలోగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని కేంద్రం ప్రతిపాదించింది. కానీ రైతులు మాత్రం చట్టాల రద్దునే కోరుతున్నారు.

కిసాన్ పరేడ్ ఎఫెక్ట్ : ఫిబ్రవరి 1న నిర్వహించే పార్లమెంట్ మార్చ్ రద్దు!.. ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపణలు..

Follow Us
ఏంటి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అల్లు అర్జున్‌కు బంధువా?
ఏంటి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అల్లు అర్జున్‌కు బంధువా?
సైకో లవ్..తనకు దక్కనిది.. ఇంకెవరికి దక్కొద్దని పెళ్లి మండపంలోనే..
సైకో లవ్..తనకు దక్కనిది.. ఇంకెవరికి దక్కొద్దని పెళ్లి మండపంలోనే..
'అన్ని సమస్యలకు అతనొక్కడే పరిష్కారమా గంభీర్'
'అన్ని సమస్యలకు అతనొక్కడే పరిష్కారమా గంభీర్'
1 గ్రాము రూ.8 లక్షలు..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రమాదకరమైన విషం
1 గ్రాము రూ.8 లక్షలు..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రమాదకరమైన విషం
శివుడు ఎవరికంటే ముందు పుట్టాడు..? స్మశానంలో ఎందుకు ఉంటాడు..?
శివుడు ఎవరికంటే ముందు పుట్టాడు..? స్మశానంలో ఎందుకు ఉంటాడు..?
అయ్యో భవానీ.. ఆమెకు సాయం చేయడానికి వెళ్లడమే శాపమైంది..
అయ్యో భవానీ.. ఆమెకు సాయం చేయడానికి వెళ్లడమే శాపమైంది..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో