Viral Video: సిమెంట్‌తో సూపర్ బెడ్..మనోడి ట్యాలెంట్‌కు మతిపోవాల్సిందే
సిమెంట్, ఇటుకలతో ఓ వ్యక్తి రాజ మంచాన్ని తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు మనోడి ట్యాలెంట్‌కు హ్యాట్సాప్ చేస్తున్నారు. బయట వేలకు వేలు ఖర్చు పెట్టి చెక్క మంచాలు కొనే బదులు.. ఇలా కట్టించుకుంటే తక్కువ ఖర్చుతో పాటు బలంగా, ఆకర్షణీయంగా, విశాలవంతంగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్ప ట్యాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రపంచానికి చూపింనప్పుడే వాళ్లకు గుర్తింపు వస్తుంది. ఇలా వాళ్ల ప్రతిభను బయటపెట్టే వారు చాలా తక్కువగా ఉంటారు. వాళ్లు తమ ప్రతిభతో ఎప్పటికప్పుడూ ఇతరులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్లు సోషల్ మీడియాలో ఏదైన వీడియో పెడితే.. అది ఇట్టే వైరల్‌గా మారుతుంది.
అలాంటి ఓ ప్రతిభావంతుడు పెట్టిన వీడియో గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం…అయితే ఈ కింద చూపించే వీడియోలో ఓ వ్యక్తి ఇటుక, సిమెంట్‌తో ఒక రాజ మంచాన్ని తయారు చేస్తున్నాడు. దాని డిజైన్ చూస్తే ఎవరైనా సరే నోరు ఎల్లబెట్టాల్సిందే. అలా ఉంది మరి మానోడి ట్యాలెంట్..సేమ్ టూ సేమ్ చెక్కతో చేసిన మాదిరిగానే దాన్ని తీర్చి దిద్దాడు..నిజం చెప్పాలంటే చెక్కతో చేసిన దానికంటే అద్భుతంగా మనోడూ మంచాన్ని డిజైన్ చేశాడు. ఆ మంచాన్ని తయారు చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియో చూసినా వారంతా మనోడి ట్యాటెంట్ కు హ్యాట్సాప్ చెబుతున్నారు. లక్షలు పెట్టి షాపింగ్ మాల్స్‌లో మంచాలు కొనే బదులు.. ఇంట్లోనే ఇలాంటి మంచాలు తయారు చేయించుకుంటే పర్మినెంట్‌గా పడి ఉంటాయనే అభిప్రాయానికి వస్తున్నారు. బయటపెట్టే డబ్బుల కంచే ఇలా కట్టించుకుంటే తక్కువ ఖర్చుతో పాటు బలంగా, ఆకర్షణీయంగా, విశాలవంతంగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి
View this post on Instagram