Video: ఉదయం నిద్ర లేవగానే ఇంటిలో దూరిన చిరుత పులి… వాళ్ల ధైర్యానికో దండంరా బాబు
కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో చిరుత పులి కలకలం రేపింది. హఠాత్తుగా చిరుతపులి ఓ ఇంట్లోకి దూరింది. ఇంట్లో నక్కిన చిరుతను చూసి ఆ కుటుంబం వణికిపోయింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు అధికారులు. ఐదు గంటల...

కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో చిరుత పులి కలకలం రేపింది. హఠాత్తుగా చిరుతపులి ఓ ఇంట్లోకి దూరింది. ఇంట్లో నక్కిన చిరుతను చూసి ఆ కుటుంబం వణికిపోయింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు అధికారులు. ఐదు గంటల ప్రయత్నం తర్వాత ఆపరేషన్ విజయవంతం అయింది. చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
బెంగళూరు శివారులో ఉన్న లీచ్ కుంట్లురెడ్డి లేఅవుట్‌లో ఈ సంఘటన జరిగింది. తొలుత గదిలోకి ప్రవేశించిన చిరుత సోఫా కింద నక్కింది. చిరుతపులిని గమనించిన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీసి బయట తాళం వేశారు. చిరుతపులిని ఇంటి లోపల బంధించడానికి ఆ వ్యక్తి పెద్ద సాహసమే చేశారు. మంజునాథ్‌కు చెందిన భవనంలో వెంకటేష్, స్నేహితుడు ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఒక చిరుతపులి రాత్రిపూట మొత్తం భవనంలో తిరుగుతుంది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వెంకటేష్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇంటి సమీపంలోకి వచ్చిన చిరుతపులిని చూసి షాక్ అయ్యారు.
వెంకటేష్, అతని స్నేహితుడు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంట్లో నుంచి బయటకు రాగానే చిరుతపులి ఇంట్లోకి చేరింది. వెంకటేష్ ధైర్యంగా ఇంటి తలుపులు వేసి తాళం వేశాడు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతపులి ఉనికిని నిర్ధారించుకున్న తర్వాత, అధికారులు ఇంట్లోకి వెళ్లి దానిని శాంతింపజేసి పట్టుకున్నారు. తరువాత వారు చిరుతపులిని బోనులో వేసి జాతీయ ఉద్యానవనానికి తరలించారు. అక్కడి నుంచి అడవిలోకి తీసుకెళ్లి వదిలేస్తామని అధికరులు చెప్పారు.