Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేపర్ లెస్ బడ్జెట్‌ సామాన్యులు తెలుసుకునేలా కేంద్రం కొత్త యాప్.. ఇందులోని ప్రత్యేకతలు ఇవే..

కోవిడ్ నేపథ్యంలో పేపర్ లెస్ బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీంతో సామాన్యులు కూడా బడ్జెట్ వివరాలు తెలుసుకునేలా మొబైల్ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల..

పేపర్ లెస్ బడ్జెట్‌ సామాన్యులు తెలుసుకునేలా కేంద్రం కొత్త యాప్.. ఇందులోని ప్రత్యేకతలు ఇవే..
Follow us
Sanjay Kasula

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 31, 2021 | 7:09 PM

Budget app Features : కోవిడ్ నేపథ్యంలో పేపర్ లెస్ బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీంతో సామాన్యులు కూడా బడ్జెట్ వివరాలు తెలుసుకునేలా మొబైల్ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. మరి ఈ యాప్​ ఫీచర్లు ఏమిటి? దీని ద్వారా ఎలాంటి సమాచారం మనం పొందొచ్చు? ఎవరైన ఎలా ఉపయోగించాలని..? ఇలాంటి అనేక అంశాలను టీవీ9 మీ కోసం అందిస్తోంది.

ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్‌-2021 పేపర్లను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గతంలోనూ బడ్జెట్‌ పత్రాలను వెబ్‌సైట్‌లో పొందే వీలున్నా.. దాన్ని మరింత సులభతరం చేస్తూ, మరిన్ని ఫీచర్లు జోడిస్తూ ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. ఇటీవల హల్వా వేడుక సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ‘యూనియల్ బడ్జెట్ మొబైల్ యాప్’ ను ‌విడుదల చేశారు. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (NIC) దీన్ని రూపొందించింది.

యూనియల్ బడ్జెట్ మొబైల్ యాప్.. విశేషాలు..

బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రసంగంను ఈ యాప్‌లో ఉంటుంది.

  1. వార్షిక ఆర్థిక నివేదిక, ఆర్థిక బిల్లు.. ఇలా 14 రకాల బడ్జెట్‌ పత్రాలను ఈ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
  2. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ పత్రాలు ఉంచారు.
  3. మొబైల్‌లో బడ్జెట్‌ పత్రాలను వీక్షించడమే కాక.. డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది.
  4. పత్రాలను ప్రింట్‌ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
  5. జూమ్‌ ఇన్‌, జూమ్‌ ఔట్‌ ఫీచర్ల కూడా ఉన్నాయి.
  6. సులువుగా చదువుకునేలా ఈ యాప్‌లో అవకాశం ఉంది.
  7. బడ్జెట్‌లో మనకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్‌ చేసే వెసులుబాటూ ఈ యాప్‌లో కల్పించారు.
  8. బడ్జెట్‌లో భాగంగా ఉదహరించిన ఇతర లింకులనూ యాక్సెస్‌ చేయొచ్చు.
  9. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ఈ యాప్‌ను బడ్జెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  10. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ యాప్‌లో బడ్జెట్‌ పత్రాలు అందుబాటులోకి వస్తాయి.

ఇవి కూడా చదవండి :

Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!

Padma Awards: తెలంగాణ ఆదివాసీ బిడ్డకు దక్కిన అరుదైన గౌవరం.. మర్లవాయిలో అంబరాన్నంటిన సంబరాలు..