Padma Awards: తెలంగాణ ఆదివాసీ బిడ్డకు దక్కిన అరుదైన గౌవరం.. మర్లవాయిలో అంబరాన్నంటిన సంబరాలు..

Padma Awards: తెలంగాణ రాష్ట్రంలోని కొమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన చెందిన ఆదివాసీ బిడ్డ కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ..

Padma Awards: తెలంగాణ ఆదివాసీ బిడ్డకు దక్కిన అరుదైన గౌవరం.. మర్లవాయిలో అంబరాన్నంటిన సంబరాలు..
Follow us

|

Updated on: Jan 26, 2021 | 4:06 PM

Padma Awards: తెలంగాణ రాష్ట్రంలోని కొమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన చెందిన ఆదివాసీ బిడ్డ కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం పద్మా పురస్కారాలను ప్రకటించడం.. కళల కోటాలో కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో మర్లవాయి మురిసిపోతుంది. దశాబ్దాలుగా ఆదివాసీల అరుదైన కళ గుస్సాడీకి ప్రాణం పోస్తున్న కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో మర్లవాయి గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. కనకరాజును గ్రామస్తులు సహా, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అయితే, కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం వరంచిన నేపథ్యంలో టీవీ9 ప్రతినిధులు ఆయన సంప్రదించారు. పద్మశ్రీ అవార్డు దక్కడంతో కనకరాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందిరా గాందీ నుండి కేసీఆర్ వరకు మహామహా నేతల సమక్షంలో తమ కళను ఆవిష్కరించానని, ఎన్నో అవార్డులు అందుకున్నానని, ప్రస్తుతం పుట్టిన ఊరు మర్లవాయిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నానని కనకరాజు వివరించారు. ఇదిలాఉంటే.. తెలంగాణ నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న ఏకైక ఆదివాసీ కనకరాజు కావడం ఒక విశేషం కాగా.. మర్లవాయి హైమన్ డార్ప్ దంపతులు నడయాడిన నేల కావడం మరో విశేషం.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 119 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో మొత్తం ఐదుగురు తెలుగు వారు పద్మ అవార్డులను దక్కించుకున్నారు. వీరిలో.. గానగంధర్వలు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, తెలంగాణకు చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతీ రామమోహనరావు, అనంతపురానికి చెందిన సాహితీవేత్త, విద్యావేత్త ప్రకాశ్ రావు ఉన్నారు.

Also read:

‘ మా జాబ్ ముగిసింది.. ఇక వెనక్కి కదులుతాం, కానీ మా లక్యం మారలేదు’, రైతు సంఘాల నేతలు

Porto captain Pepe Fight: గ్రౌండ్‌లో కొట్టుకున్న ఫుట్‌బాల్ ఆటగాళ్లు.. వైరల్‌గా మారిన వీడియో..