క్షయ తృతీయ రోజు బంగారమే కాదండోయ్.. ఈ వస్తువులు కూడా కొనుగోలు చేస్తే చాలా మంచిదంట

samatha 

18 April 2025

Credit: Instagram

అక్షయ తృతీయ వచ్చేస్తుంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి డబ్బులు సిద్ధం చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు బంగారం కొనడం చాలా మంచిదంటారు.

అయితే అక్షయ తృతీయ రోజున బంగారమే కాకుండా కొన్ని రకాల వస్తువులు కొన్న కూడా చాలా అదృష్టం కలిసి వస్తుందంటున్నారు పండితులు.

ఇంతకీ అక్షయ తృతీయ రోజున బంగారం కాకుండా, ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయవచ్చునో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

అక్షయ తృతీయ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయడం చాలా మంచిదంట. ఈ రోజున నూతన వాహనం ఇంటికి అదృష్టాన్ని తీసుకొని రావడమే కాకుండా అన్నిట్లో కలిసి వస్తుందంట.

అంతే కాకుండా బంగారం, వెండి మాత్రమే కాకుండా అక్షయతృతీయ రోజున కొత్త బట్టలు కొనడం కూడా చాలా శుభకరం అంటున్నారు పండితులు.

బంగారం ధర చాలా పెరిగిపోతుంది. అయితే ఈ రోజు బంగారం కొనుగోలు చేయలేని వారు తప్పకుండా వెండినాణెం కొనుగోలు చేయవచ్చునంట.

అదే విధంగా అక్షయ తృతీయ రోజున పుస్తకాలు కొనడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఈరోజు పుస్తకాలు కొంటే వ్యక్తిగత వృద్ధి జరుగుతుందంట.

అలాగే అక్షయ తృతీయ రోజున రాగి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు కొనుగోలు చేయడం చాలా మంచిదే కాకుండా శుభప్రదం అంటున్నారు పండితులు.