Telangana: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మధ్యాహ్న భోజనంలో బిర్యానీ, కిచిడీ.. తొలి రోజు నుంచే అమలు..

Mid Day Meal Scheme: తెలంగాణ ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు శుభవార్త.. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నూతన విద్యాసంవత్సరం(2023-24) నుంచి మధ్యాహ్న భోజనంలో కిచిడీ, వెజ్‌ బిర్యానీ కూడా ఉండనున్నాయి. మధ్యాహ్న భోజనంలో ప్రతి శనివారం వెజ్ బిర్యానీ పెట్టాలని..

Telangana: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మధ్యాహ్న భోజనంలో బిర్యానీ, కిచిడీ.. తొలి రోజు నుంచే అమలు..
Mid Day Meal Scheme
Follow us

|

Updated on: Jun 02, 2023 | 7:26 AM

Mid Day Meal Scheme: తెలంగాణ ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు శుభవార్త.. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నూతన విద్యాసంవత్సరం(2023-24) నుంచి మధ్యాహ్న భోజనంలో కిచిడీ, వెజ్‌ బిర్యానీ కూడా ఉండనున్నాయి. మధ్యాహ్న భోజనంలో ప్రతి శనివారం వెజ్ బిర్యానీ పెట్టాలని గతేడాది వరకు ఉన్న సూచనను ఇప్పుడు తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇంకా వెజ్ బిర్యానీతో పాటు కిచిడి కూడా ఉండాలని పేర్కొంది. గతేడాది మధ్యాహ్న భోజన పథకం పనితీరును పరిశీలించిన కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని జాయింట్‌ రివ్యూ మిషన్‌ బృందం.. మెనూ మార్చాలని సూచించింది. ఈ మేరకు జాతీయ పోషకాహార సంస్థ(NIN) కొత్త మెనూ రూపొందించింది.

అలాగే వేసవి సెలవులు ముగిసి విద్యాలయాలు పునఃప్రారంభమయ్యే రోజు నుంచే ఈ మెనూని అమలు చేయాలని స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన గురువారం డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం మధ్యాహ్నం భోజన పథకం కింద అన్నం వండి పెట్టినందుకు వస్తువుల ఖర్చు కింద రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.5.45, 6-10 తరగతులకు రూ.8.17 చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 26 వేల పాఠశాలల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

ప్రతి వారం మెనూ

  1. సోమవారం- కిచిడీ+ కోడి గుడ్డు
  2. మంగళవారం- అన్నం+ సాంబారు
  3. బుధవారం- అన్నం+ ఆకుకూర పప్పు+ గుడ్డు
  4. గురువారం- వెజ్ బిర్యానీ
  5. శుక్రవాం- అన్నం+ సాంబారు
  6. శనివారం- అన్నం+ ఆకుకూర పప్పు

చెల్లింపు ధరలు పెంచకుండే కష్టమే..

విద్యార్థుల కోసం కొత్త మెనూని ప్రవేశపట్టిన నేపథ్యంలో..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ధరతో భోజనం పెట్టడం సాధ్యం కావట్లేదని మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఇప్పటికే వాపొతున్నారు. చెల్లింపు ధరలు పెంచాలని కూడా ఎన్నో సార్లు ధర్నాలకు దిగారు. కొన్నిపాఠశాలల్లోని కార్మికులు అయితే తమ వల్ల కాదని చేతులెత్తేశారు. కరోనా తరువాత నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ధరలకు 9.6శాతమే పెంచింది. వాస్తవానికి ఏటా 7.5శాతం పెంచాల్సి ఉన్నప్పటికీ ఇంకా వచ్చే ఏడాదికి సంబంధించి ధర చెల్లింపులు పెంచుతూ ఆదేశాలు జారీ చేయకపోవడంతో సదరు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ధర పెంచకుండా కొత్తగా రూపొందించిన భోజన మెనూను అమలు చేయడం కష్టమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తమ గౌరవ వేతనాన్ని రూ.1 వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచుతామని గతేడాది సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని, దానిపై నెలల క్రితమే జీఓ పాస్ చేసినప్పటికీ అమలు కాలేదని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..