Telangana Formation Day: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగరవేసిన కిషన్‌ రెడ్డి.. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరడం లేదంటూ..

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోం కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జాతీయపతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంచారు. ఈ సందర్భంగా పోలీసులు నుంచి గౌరవ వందనం స్వీకరించారు కేంద్రమంత్రి. అనంతరం మాట్లాడుతూ '

Telangana Formation Day: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగరవేసిన కిషన్‌ రెడ్డి.. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరడం లేదంటూ..
Telangana Formation Day Celebrations
Follow us

|

Updated on: Jun 02, 2023 | 8:00 AM

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తై, పదో వసంతంలోకి అడుగపెట్టనుండంతో రాష్ట్రమంతటా సంబరాలు నెలకొన్నాయి. ఇక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోం కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జాతీయపతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంచారు. ఈ సందర్భంగా పోలీసులు నుంచి గౌరవ వందనం స్వీకరించారు కేంద్రమంత్రి. అనంతరం మాట్లాడుతూ ‘ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మనం వేడుకలు జరుపుకొంటున్నాం. చిన్నా, పెద్దా ముసలి సకల జనులందరూ సమష్ఠిగా పోరాడితేనే ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను త్యాగం చేసిన 1200 మంది అమరవీరులకు మనం నివాళి అర్పించాలి. తెలంగాణ సాధనలో బీజేపీ తెలంగాణ గుండెచప్పుడయ్యింది. మన రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో అలుపెరగని పోరాటం చేసిన సుష్మా స్వరాజ్‌. ఆమెకు కూడా మనం నివాళి అర్పించాలి ‘ అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

కాగా ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దగాకోరుల పాలవుతుందని కిషన్‌ రెడ్డి పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు. కాగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మోడీ తొమ్మిదేళ్ళ పాలనకు సంభందించి పోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం భారత సాంస్కృతిక వైభవంతో పాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై రెండు చిత్రాల ప్రదర్శన ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..