Telangana: పండుగ వేళ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
తెలంగాణలో విద్యా రంగంలో పెద్ద సంస్కరణలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో కొత్త తరహా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించనున్న ప్రభుత్వం.. పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ప్రణాళికతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణలో విద్యా సంస్కరణల దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. తాజాగా నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఉన్న చిన్నారులకు అత్యుత్తమ, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కొత్త తరహా ప్రభుత్వ పాఠశాలలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఆదేశించారు. ఈ పాఠశాలలు పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో ఉండాలని, విద్యార్థులకు పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి తన నివాసంలో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ కొత్త పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రెడీ చేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలని.. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టి కేంద్రీకరించాలని ఆయన తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ స్థాయిలో తీర్చిదిద్దాలన్న సీఎం.. ప్లే గ్రౌండ్స్, మోడ్రన్ క్లాస్ రూమ్స్, ఆహ్లదభరితమైన వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. సరైన సౌకర్యాలు లేని బడులను సమీపంలోని ప్రభుత్వ భూముల్లోకి తరలించి అవసరమైన వసతులు కల్పించాలని కూడా ఆయన ఆదేశించారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
Also Read: ఘట్‌కేసర్‌లో అనుమానాస్పదంగా 17 ఏళ్ల బాలుడు.. ఆపి తనిఖీ చేయగా..




