AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తే వారు మారతారు.. నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి..

ట్రాన్స్ జెండర్ల కు కూడా ఒక గుర్తింపు తెచ్చే విధంగా వారిని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ సిగ్నల్ ల దగ్గర వాహనదారుల దగ్గర డబ్బులు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు అదే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నేటి నుండి ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ డ్యూటి చేస్తున్నారు.

Telangana: అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తే వారు మారతారు.. నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి..
Transgenders Recruited As Traffic Assistants
Sridhar Rao
| Edited By: Surya Kala|

Updated on: Dec 23, 2024 | 12:17 PM

Share

దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ ఇచ్చి ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం. శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్ జెండర్లను కుటుంబ సభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోంది. దీంతో వారు కూడా మనుషులేనని..  వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని తెలంగాణ ప్రభుత్వం కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాన్సోజెండర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించామని, అంకిత భావంతో పనిచేస్తే రానున్న రోజుల్లో ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందని సిపి సివి ఆనంద్ అన్నారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ట్రాన్సోజెండర్లకు ఉద్యోగాలిస్తాయని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ట్రాన్జ్సజెండర్లు పెళ్లిళ్లలో, దుకాణాల వద్ద డబ్బులు డిమాండ్ చేయడం, వ్యభిచారం చేయడం గమనించామని, వారికి సరైన అవకాశాలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తే వారు మారుతారని భావించిన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో వారు గౌరవ ప్రదంగా జీవించే విధంగా ప్రత్యేకంగా జీవో తెచ్చారని సిపి అన్నారు. ముందుగా ట్రాఫిక్ విభాగంలో హోంగార్డు స్థాయిలో వీరి సేవలను వినియోగించుకుంటన్నామని చెప్పిన సిపి ఆనంద్ శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్లను విధులు కేటాయించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..