AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jangaon: ఇది కదా పండగంటే.. నిరుపేద కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు

పండుగ అందరూ జరపుకోలేరు. కొంతమందికి ఆ స్థోమత ఉండదు. అలాంటి వారికి క్రిస్మస్ కానకలు అందజేశారు ఈ విద్యార్థులు. నలుగురు కలిసి చేసుకునేదే పండుగ అని చాటిచెప్పారు. అసలైన క్రీస్తు తత్వానికి అర్థం చెప్పారు. ఎక్కడ.. ఏంటి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Jangaon: ఇది కదా పండగంటే.. నిరుపేద కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు
Christmas Donation
Ram Naramaneni
|

Updated on: Dec 23, 2024 | 1:36 PM

Share

జనగాం జిల్లాలోని బాల యేసు విద్యార్థులు నిరుపేదలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. గత కొద్ది రోజులుగా పాఠశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు సొంతంగా సేకరించిన నిధులతో క్రీస్తు జన్మదినం సందర్భంగా జనగాం జిల్లా దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి నిరుపేద కుటుంబాలకు ఈ క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ కానుకలలో బియ్యము, ఉప్పు, పప్పులు, దుప్పట్లు, చెద్దర్లు సుమారుగా మూడు లక్షల 20వేల రూపాయలతో తాము సేకరించిన డబ్బులతో కొనుగోలు చేసి అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజు చిన్నారులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను చదువుతోపాటు విద్యార్థులు అలవర్చుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్ స్టార్టయ్యాయి. అన్ని చర్చిలూ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయి. మరొక్క రోజు గడిస్తే క్రిస్మస్. దీంతో ప్రత్యేక ప్రార్థనలు, శాంటాక్లాజ్‌ల సందడి నెలకొంది. క్రిస్‌మస్‌ ట్రీలను అందంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ కేథడ్రల్‌కు యేసు విశ్వాసుల పెద్ద ఎత్తున హాజరవ్వనున్నారు.  చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డియోసెస్ పరిధిలోని 13 జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది  మెదక్ చర్చికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు చర్చి పాస్టోరేట్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రధాన టవర్, తోరణాలు, ప్రాంగణం, చర్చి లోపలి భాగాన్ని రంగురంగులగా అలంకరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.