Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Railway Jobs: రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

నిరుద్యోగులకు రైల్వే శాఖ భారీ శుభవార్త తెలిపింది. ఇప్పటికే పలు ఉద్యోగా నోటిఫికేషన్లు జారీ చేసిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. విభాగాల వారీగా ఖాళీల వివరాలతోపాటు దరఖాస్తు వివరాలను కూడా బోర్డు వెల్లడించింది. అయితే త్వరలోనే వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల కానుంది..

RRB Railway Jobs: రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
RRB Railway Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 23, 2024 | 6:28 AM

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) మరో కీలక ప్రకటన జారీ చేసింది. రైల్వేలో వేర్వేరు కేటగిరీల్లో దాదాపు 1,036 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదలకానుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీతో పాటు పలు పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జనవరి 7, 2025 నుంచి అన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలివే..

  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు: 187
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు: 338
  • సైంటిఫిక్ సూపర్‌వైజర్ (ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్) పోస్టులు: 3
  • చీఫ్ లా అసిస్టెంట్ పోస్టులు: 54
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు: 20
  • ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్(ఇంగ్లీష్ మీడియం) పోస్టులు: 18
  • సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 2
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ పోస్టులు: 130
  • సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 3
  • స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 59
  • లైబ్రేరియన్ పోస్టులు: 10
  • సంగీత ఉపాధ్యాయుడు (ఉమెన్స్) పోస్టులు: 3
  • ప్రైమరీ రైల్వే టీచర్ పోస్టులు: 188
  • అసిస్టెంట్ టీచర్ (ఫిమేల్ జూనియర్ స్కూల్) పోస్టులు: 2
  • ల్యాబ్ అసిస్టెంట్ / స్కూల్ పోస్టులు: 7
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3 (కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్) పోస్టులు: 12

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 6, 2025. దరఖాస్తు సమయంలో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన వారు రూ.500, ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు చెందిన వారు రూ.250 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎంపిక విధానం, అర్హతలు, వయోపరిమితి వంటి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.