AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Civils Interview Dates: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. ఎంత మంది ఎంపికయ్యారంటే

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 ఇంటర్వ్యూ తేదీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మెయిన్స్ లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలోనే విడుదలకానున్నాయి. ఇంటర్వ్యూకి ఎంత మంది ఎంపిక అయ్యారో.. ఏయే తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయో ఆ వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

UPSC Civils Interview Dates: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. ఎంత మంది ఎంపికయ్యారంటే
UPSC Civils Interview
Srilakshmi C
|

Updated on: Dec 23, 2024 | 7:21 AM

Share

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2024 మెయిన్‌ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్‌ పరీక్షలు జరగగా.. డిసెంబర్‌ 9న ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 2,845 మంది అభ్యర్థులు తదుపరి దశకు ఎంపికయ్యారు. ఈక్రమంలో తాజాగా ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ వెల్లడించింది.

వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయంకు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. త్వరలోనే ఇ-సమన్‌ లెటర్లు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ పేర్కొంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్‌ పరీక్షలు జరగ్గా.. ఇందులో అర్హత సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకి అనుమతిస్తారు. ఈ ఏడాదికి మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా గతేడాది ఏప్రిల్‌ 16న వెల్లడైన సివిల్స్‌ 2023 తుది ఫలితాల్లో ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 60 మంది వివిధ సర్వీసులకు ఎంపికవడం విశేషం. వారిలో నలుగురు ఏకంగా 100లోపు ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అనన్య రెడ్డికి మూడో ర్యాంకు సాధించారు. ఎంతో కఠినమైన ఈ సివిల్‌ సర్వీస్ పరీక్షలకు తెలుగు వారు యేటా అధిక సంఖ్యలో ఎంపిక కావడం గర్వకారణం. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో తెలుగోళ్లు సత్తా చాటే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.