AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LED Lights Cultivation: ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..

చామంతి పూల తోటలను విద్యుత్ వెలుగులతో పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు ఓ యువకుడు. సవాలుగా మారిన వాతావరణ పరిస్థితుల నుంచి చామంతిని కాపాడుకుంటూ పొలమంతా విద్యుత్ కాంతులను నింపి పంట దిగుబడితో సేద్యంలో రాణిస్తున్నాడు. వేల సంఖ్యలో వెలుగుతున్న బల్బులతో పువ్వుల సాగు చేస్తున్నాడు పెద్ద మండ్యానికి చెందిన యువ రైతు ప్రయత్నం...!

LED Lights Cultivation: ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
Chrysanthemum Cultivation Led Lights
Raju M P R
| Edited By: Surya Kala|

Updated on: Dec 23, 2024 | 10:20 AM

Share

ఆకాశాన్ని మబ్బులు.. చుట్టూ ఉన్న కొండల్ని మేఘాలు కప్పేయగా చిరు జల్లులతో కురుస్తున్న మంచు సాగు చేసిన పంట చేతికి అందన్న పరిస్థితి పెంటాడింది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు చల్లటి గాలులు దూసుకొస్తున్న పరిస్థితి కళ్ళెదుట ఆందోళనకు గురి చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసిన పైరుకు గొడుగు పట్టడం, చలి తీవ్రతను తట్టుకునేలా మంటలు వేసి మొక్కలను కాపాడుకోవడం ఒక్కటే మార్గమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రూ. వేలల్లో ఖర్చు చేసి చామంతి సాగు చేసిన ఒక యువరైతు ఆలోచన అన్నమయ్య జిల్లాలో అందరినీ ఆకట్టుకుంటుంది.

పెద్దమండ్యం మండలం కలిచర్ల చెందిన యువరైతు అబ్దుల్లా మదిలో ఒక వినూత్న ప్రయోగమే మెదిలింది. చామంతి చెట్టుకు గొడుగు పట్టి చలికి వేడిని కలిగించే వాతావరణాన్ని కల్పించిన అబ్దుల్లా దాదాపు 5 ఎకరాల్లో ఇలాంటి పనే చేసినట్లు స్పష్టం అవుతుంది. 5 ఎకరాల్లో చామంతిని సాగు చేసిన అబ్దుల్లా కిరణజన్య సంయోగ్య క్రియ ను పెంచడం ద్వారా మొక్కలో ఎదుగుదలకు తోడ్పడుతుందని గుర్తించాడు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో పర్బాని యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసిన అబ్దుల్లా వాతావరణం లోని ప్రతి కూల పరిస్థితుల్లోనూ మొక్క ఎదుగుదల ఉండేలా వినూత్న ప్రయోగం చేశాడు. కలకత్తా నుంచి టిష్యూ కల్చర్ నర్సరీ నుంచి సెంట్ ఎల్లో రకానికి చెందిన 70 వేల చామంతి మొక్కలను తెచ్చి నెలరోజుల క్రితం ఐదు ఎకరాలలో నాటారు. వ్యవసాయంలో డిగ్రీ పట్టాను పొంది సొంత పొలంలో వినూత్న పంటలను సాగు చేస్తున్న అబ్దుల్లా చామంతి దిగుబడి ఆశాజనకంగా ఉండేందుకు చేసిన కొత్త ప్రయత్నం ఆ పల్లెటూరులో విద్యుత్ కాంతులను వెదజల్లుతోంది.

దాదాపు 4వేల ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసి చామంతికి చలిలోనూ వేడి కలిగించే వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఎల్ఈడి బల్బుల కాంతి వల్ల చామంతి మొక్కలో కిరణజన్య సంయోగక్రియ రాత్రి పూట జరిగి ఎదుగుదలకు దోహద పడుతోంది. ఎకరం చామంతి సాగుకు రూ. 2.50 లక్షలు పెట్టుబడి పెట్టిన యువరైతు అబ్దుల్లా మొక్క నాటిన 90 రోజుల్లోపు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. సరైన మేలుకవలు పాటిస్తే దాదాపు మూడు నెలల వరకు చామంతి దిగుబడి ఉంటుందని చెబుతున్న అబ్దుల్లా ఎకరానికి 5 నుంచి 6 టన్నుల మేర దిగుబడి ఉంటుదంటున్నారు కలిచెర్ల కు చెందిన యువరైతు అబ్దుల్లా.

పెద్దమండ్యం మండలం కలిచెర్ల కు చెందిన అబ్దుల్లా ఫెర్టిలైజర్స్ షాప్ నిర్వహిస్తున్న తండ్రి అజంతుల్లా ప్రోత్సాహంతోనే వ్యవసాయంలో రాణిస్తున్నాడు. వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడైన అబ్దుల్లా బ్రెజిల్ లో చేస్తున్న ఎల్ఈడి వెలుగులతో జరుగుతున్న సాగు విధానం పట్ల ఆకర్షితుడై ఇప్పుడిలా సేద్యంలో రాణిస్తున్నాడు. విద్యుత్ కాంతుల మద్య పూల సాగు చేస్తున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..