AP – Telangana: తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు.. ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది..?

పుష్ప ఎఫెక్ట్‌తో టాలీవుడ్‌కు షాక్‌ ఇచ్చారు.. సీఎం రేవంత్‌రెడ్డి. ఇకపై టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు ఉండవని తేల్చిచెప్పారు. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారు నిర్ణయం.. సంక్రాంతి బరిలో ఉన్న బడా బడ్జెట్‌ సినిమాలను టెన్షన్ పెడుతోంది. భారీ కలెక్షన్స్‌ను టార్గెట్‌ చేసిన ఆ మూవీస్ పరిస్థితి ఏంటి..? రికార్డులపై ఆ సినిమాలు ఆశలు వదులుకోవాల్సిందేనా..? తెలంగాణ సరే ఏపీలో చంద్రబాబు సర్కారు ఏం చేయబోతోంది..?

AP - Telangana: తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు.. ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది..?
Benefit Show
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 23, 2024 | 8:19 AM

తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపును రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన  కామెంట్స్‌..సంక్రాంతి సీజన్‌ను టార్గెట్‌ చేసిన బడా మూవీస్‌కు షాక్‌ ఇచ్చాయి. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై సీరియస్‌ అయిన ముఖ్యమంత్రి.. ఇక నుంచి తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని అసెంబ్లీలో స్పష్టం చేశారు. సినిమాలు చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.

సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు.. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నారాయణ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్ రేట్ల పెంపును ఖండించిన నారాయణ.. సందేశాత్మక చిత్రాలకు మాత్రమే ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక మీదట పెద్ద సినిమాల టికెట్ రేట్లు పెంచబోమన్న సీఎం రేవంత్ ప్రకటనను స్వాగతించారు తెలంగాణ సింగిల్ స్క్రీన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి.

‘పుష్ప2’కు గతంలో ఎప్పుడూ లేని అవకాశం

సంక్రాంతి సీజన్‌ను టార్గెట్‌ చేసిన బడామూవీస్‌కు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం షాకే అంటున్నారు..మూవీ ఎక్స్‌పర్ట్స్‌. డిసెంబరు 5న రిలీజైన ‘పుష్ప2’ మూవీకి ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా తెలంగాణ సర్కారు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. విడుదలకు ముందు రోజే పెయిడ్‌ ప్రీమియర్‌ షోలకూ అనుమతి ఇచ్చింది. దీంతో ‘పుష్ప2’ భారీగా వసూళ్లు సాధించింది. తొలిరోజు అత్యధికంగా రూ.294 కోట్లు వసూలు చేసి చరిత్రకెక్కింది. ఇప్పుడు ఏకంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రానున్న సినిమాల వసూళ్లపై భారీ ఎఫెక్ట్‌ చూపే అవకాశం కనిపిస్తోంది.

రూ. 450 కోట్లతో తెరకెక్కిన “గేమ్‌ ఛేంజర్‌”

సంక్రాంతి కానుకగా మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ ఆడియన్స్ ముందుకు వస్తోంది. దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు కూడా..పుష్ప 2 తరహాలోనే ఒక రోజు ముందుగానే భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. బిగ్‌ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావటంతో టికెట్ రేట్ల విషయంలోనూ భారీ హైక్‌ ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం ‘గేమ్‌ ఛేంజర్‌’ వసూళ్లకు గండి కొట్టేలా ఉంది. భారీ టికెట్‌ రేట్లతో పాటు, ప్రీమియర్‌ షోలు తొలి రోజు పుష్ప -2 వసూళ్లలో కీ రోల్‌ ప్లే చేశాయి.కానీ ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’కు బెనిఫిట్ షోస్‌, టికెట్‌ హైక్‌ లేకపోతే పుష్ప 2 కలెక్షన్స్‌లో సగం రావటం కూడా కష్టమే అన్నది ట్రేడ్‌ ఎనలిస్ట్‌ల మాట.

డాకూ మహారాజ్‌కు ఆ వసూళ్లు కష్టమేనా?

సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న మరో బిగ్ మూవీ..బాలయ్య నటించిన “డాకూ మహరాజ్‌”. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కూడా ప్రీమియర్స్‌తో పాటు టికెట్‌ రేట్స్‌ హైక్‌ కోసం మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు. కానీ డాకూ మహరాజ్‌కు కూడా అవకాశం లేదు కాబట్టి..వసూళ్ల భారీగా పడిపోనున్నాయి. బాలయ్య గత చిత్రం భగవంత్ కేసరి ఫుల్‌ రన్‌లో 130 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఆ సినిమాకు టికెట్‌ రేట్స్‌ హైక్‌తో పాటు బెనిఫిట్‌ షోస్‌ కూడా భారీగా పడ్డాయి. ఇప్పుడు అవేవి లేకుండా డాకూ మహారాజ్‌కు ఆ స్థాయలో వసూళ్లు రావటం కష్టమే.

సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న మీడియం బడ్జెట్‌ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం” ఇది మాస్ మూవీ కాదు కాబట్టి ప్రీమియర్స్‌, బెనిఫిట్‌ షోస్ ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా..బడ్జెట్‌ పరంగా టికెట్‌ రైట్స్ హైక్ మాత్రం నిర్మాతలు ఆశించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం అలాంటి వెసులు బాటు ఇచ్చే ఛాన్స్‌ లేదు కాబట్టి..వెంకటేష్ సినిమాకి భారీ వసూళ్లు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి

టాలీవుడ్‌ కలెక్షన్స్‌ రికార్డులను తారుమారు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై..మూవీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు, తెలంగాణ సర్కారు బాటలోనే ఏపీ ప్రభుత్వం నడుస్తుందా? సంక్రాంతి సినిమాలపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే, ‘పుష్ప 2’ టికెట్‌ ధరల విషయంలో చివరి వరకూ ఏపీలో సస్పెన్స్‌ కంటిన్యూ అయింది. మరోవైపు తెలంగాణలో మిడ్ నైట్ షోలు వేయకుండా కేవలం ఏపీలోనే వేస్తే టాక్ పరంగా అదో తలనెప్పి. అటుఇటు అయ్యిందంటే అంతే సంగతులు. మరి సంక్రాంతి మూవీస్‌పై చంద్రబాబు సర్కారు.. ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్