AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే

సంగారెడ్డి జిల్లా రైకోడ్ మండలం రామోజిపల్లి గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు మైనర్ బాలురు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులను నిరంజన్ (13), బసవరాజు (10), మరియు మణి (12) గా గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఈత కొట్టడానికి చెరువులోకి దిగారు. లోతు అంచనా వేయలేక కాసేపటికే ముగ్గురూ మృత్యువాత పడ్డారు..

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే
Three Children Drown After Falling Into Pond
P Shivteja
| Edited By: |

Updated on: May 18, 2026 | 1:39 PM

Share

సంగారెడ్డి, మే 18: సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రామోజీపల్లి గ్రామంలో ముగ్గురు చిన్నారులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈత కోసం వెళ్లిన ముగ్గురు పసిప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవడంతో గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది..మృతి చెందిన వారిలో బస్వరాజ్ (10), మణి (8), నిరంజన్ (8) ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే..

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ (మం) రామోజీపల్లి ఒక్కసారిగా కన్నీటి సముద్రమైంది. ఎప్పుడూ నవ్వుతూ, ఆడుకుంటూ కళ్లముందే తిరిగే ముగ్గురు చిన్నారులు.. చెరువు రూపంలో వచ్చిన మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు బస్వరాజ్, మణి, నిరంజన్ లు వెళ్లారు. అయితే నీటి లోతును అంచనా వేయలేక ముగ్గురు చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు నీటిలో గల్లంతయ్యారు. చిన్నారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు చెరువు వద్దకు చేరుకుని గాలించారు.

Three Boys Drown In Pond

ఇవి కూడా చదవండి

నీటిలో మునిగిపోయిన చిన్నారులను బయటకు తీసేసరికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. బస్వరాజ్, మణి, నిరంజన్ లు అప్పటికే ప్రాణాలు కోల్పోయి అచేతనంగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ముగ్గురు చిన్నారుల మృతితో రామోజీపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Follow Us