AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Alert: సామాన్యుడికి మరో షాక్.. పెట్రోల్, డీజిల్ తర్వాత ఇప్పుడు ఈ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం..!

Big Alert: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సామాన్యుల పై మరో భారం పడనుంది. పెట్రోల్, డీజిల్ ధరల తర్వాత ఇప్పుడు రోజువారీ జీవితంలో వాడే మరెన్నో వస్తువుల ధరలు భారీగా పెరగబోతున్నాయని ఈ నివేదిక హెచ్చరిస్తోంది..

Big Alert: సామాన్యుడికి మరో షాక్.. పెట్రోల్, డీజిల్ తర్వాత ఇప్పుడు ఈ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం..!
Big Aler
Subhash Goud
|

Updated on: May 18, 2026 | 1:21 PM

Share

Big Alert: రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం (Inflation), ముడిసరుకుల కొరత కారణంగా సబ్బులు, షాంపూలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు వంటి ఎఫ్‌ఎమ్‌సిజి (FMCG – ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) ఉత్పత్తుల ధరలు పెరగవచ్చని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Snake Attract Plants: మీ ఇంటి పెరట్లో ఈ మొక్కలు ఉన్నాయా? అయితే పాములు ఎక్కడున్న వచ్చేస్తాయ్‌.. జాగ్రత్త..!

1. ఏయే వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది?

  • రోజువారీ వస్తువులు: మనం ప్రతిరోజూ ఇంట్లో ఉపయోగించే సబ్బులు (Soaps), షాంపూలు (SHAMP00S), డిటర్జెంట్లు (Detergents), టూత్‌పేస్ట్‌ల ధరలు పెరగనున్నాయి. అలాగే
  • ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు: బిస్కెట్లు, నూడుల్స్, టీ పొడి, కాఫీ పొడి, వంట నూనెలు, ఇతర ప్యాక్ చేసిన స్నాక్స్ ధరలు కూడా ప్రియం కానున్నాయి.
  • ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే.. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్, క్రూడాయిల్, ఇతర ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు పెరగడమే కంపెనీలు ధరలు పెంచడానికి ప్రధాన కారణం.

2. పెరగనున్న రవాణా ఖర్చులు

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం నేరుగా రవాణా రంగంపై పడింది. ఫ్యాక్టరీల నుండి వస్తువులను మార్కెట్లకు తరలించే రవాణా ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు ఆ అదనపు భారాన్ని వినియోగదారులపైనే వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

3. సామాన్యుల ఆందోళన

ఇప్పటికే కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. ఇప్పుడు రోజువారీ వాడే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగితే, నెలవారీ ఖర్చులు మరింత పెరిగి జీవన భారం తీవ్రం కానుందని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rice Weevils: ఇంట్లో ఉన్న బియ్యంకు పురుగు పడుతుందా? పురుగులు పోవడానికి ఈజీ టిప్స్!

ఇది కూడా చదవండి: Bakrid 2026 Date: భారత్‌లో బక్రీద్‌ పండుగ ఎప్పుడు? తేదీపై స్పష్టత ఇచ్చిన ఇస్లామిక్ పండితులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us