AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veerabhadrudu: బాక్సాఫీస్‌పై ‘వీరభద్రుడి’ ప్రతాపం.. మూడు రోజుల్లో సూర్య సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

సూర్య నటించిన కరుప్పు ( తెలుగులో వీరభద్రుడు) సినిమా రిలీజ్ కు ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా సినిమాలో హీరో సూర్య గాడ్ మోడ్ అవతారం, యాక్షన్ సీన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

Veerabhadrudu: బాక్సాఫీస్‌పై 'వీరభద్రుడి' ప్రతాపం.. మూడు రోజుల్లో సూర్య సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Veerabhadrudu Movie
Basha Shek
|

Updated on: May 18, 2026 | 1:35 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. ఈ మూవీని తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటించింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా శుక్రవారం (మే 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో లేకపోయినా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ సూర్య సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో వీరభద్రుడు సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇప్పటివరకు సూర్య సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 147 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఇండియాలో90 కోట్ల కు గ్రాస్ రాబట్టగా.. ఓవర్‌సీస్‌లో రూ.50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ మూవీ ఆదివారం ఒక్క రోజే రూ.35 కోట్ల కు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై SR ప్రభు, SR ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో డైరెక్టర్ ఆర్జే బాలాజీనే విలన్ గా చేయడం విశేషం. అలాగే ఇంద్రాన్స్, నట్టి సుబ్రమణ్యం, సుప్రీత్, అనఘా మాయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ సినిమాకు స్వరాలందించారు. ఈ చిత్రంలో, సూర్య.. శరవణన్ అనే లాయర్ పాత్రను పోషించారు. దోపిడీకి గురై, అవినీతిమయమైన న్యాయ వ్యవస్థలో చిక్కుకున్న తండ్రీకూతుళ్ల కథగా ఈ మూవీని తెరకెక్కించారు. ప్రస్తుతం వీరభద్రుడి జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డు కలెక్షన్లు సాధించే అవకాశముందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!