AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల అరెస్టుతో ఉద్రిక్తత

సిరిసిల్ల నియోజకవర్గంలోని అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం రాజకీయ రగడకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటోను ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రదర్శించకపోవడంపై బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన బిఆర్ఎస్ యూత్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేటీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించకపోవడంపై మండిపడిన బిఆర్ఎస్ […]

Telangana: సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల అరెస్టుతో ఉద్రిక్తత
G Sampath Kumar
| Edited By: |

Updated on: May 27, 2025 | 7:00 AM

Share

సిరిసిల్ల నియోజకవర్గంలోని అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం రాజకీయ రగడకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటోను ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రదర్శించకపోవడంపై బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన బిఆర్ఎస్ యూత్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేటీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించకపోవడంపై మండిపడిన బిఆర్ఎస్ కార్యకర్తలు, మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు నేతృత్వంలో కార్యకర్తలు నిరసనకు దిగగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శనివారం రోజున కొందరు బిఆర్ఎస్ నాయకులు జిల్లా అధికారులు ప్రస్తుతం జరుగుతున్న నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో ప్రోటోకాల్ ప్రాకారం కేటీఆర్ ఫోటో పెట్టడం లేదని కలెక్టర్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు

ప్రతీ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టాల్సిందే అంటూ బిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం సోమవారం మరింత ముదిరింది. సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు భారీగా గుమిగూడడంతో ఉద్రిక్తత నెలకొంది. బిఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే ఫోటో లేకుంటే కార్యక్రమం లేదు అనే అభిప్రాయంతో బహిరంగంగా సవాలు విసరగా, కాంగ్రెస్ నేతలు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో”సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెడతాం” అంటూ ర్యాలీ తో వచ్చారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. పలువురు నేతలు గాయపడ్డారు. ఇరుపక్షాల కీలక నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

సిరిసిల్లలో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడమే ఈ ఉద్రిక్తతలకు కారణమవుతోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముండటంతో క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రెండు పార్టీల నేతలపై, కార్యకర్తలపై కేసులు పెట్టే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికి.. సిరిసిల్ల లో తరుచు ఉద్రి క్త త పరిస్థితి లు నెలకొన్నాయి.

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి