KTR Notice: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు!
KTR Notice: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి.. రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రేవంత్ కుటిల రాజకీయ క్రీడలో భాగమే నోటీసులు అని విమర్శించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా.. తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్..

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసు ఇచ్చింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. యూకే పర్యటన తర్వాత హాజరవుతానన్నారు కేటీఆర్. ఏసీబీ నోటీసులపై కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజకీయ వేధింపులతోనే కేసు వేశారన్నారని అన్నారు. 48 గంటల క్రితం హెరాల్డ్ కేసులో.. రేవంత్ పేరు ఈడీ చార్జ్‌షీట్‌లో వచ్చిందని, రేవంత్ గురించి ఒక్క బీజేపీ నేత కూడా మాట్లాడలేదని అన్నారు. 24 గంటల్లోనే మోదీ సహా బీజేపీ నేతలతో రేవంత్ ఫొటోలు దిగుతూ దర్శనమిచ్చారన్నారు కేటీఆర్. బీఆర్‌ఎస్ అంటే సీఎం రేవంత్‌కు భయమన్న కేటీఆర్.. చౌకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటన తర్వాత ఏసీబీ విచారణకు హాజరవుతానని, కచ్చితంగా అధికారులకు సహకరిస్తానని అన్నారు కేటీఆర్.
నోటీసులపై స్పందించని ఎమ్మెల్సీ కవిత
కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి.. రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రేవంత్ కుటిల రాజకీయ క్రీడలో భాగమే నోటీసులు అని విమర్శించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా.. తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులది అన్నారు కవిత.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
