Telangana: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆర్టీసీ బస్సుల్లో తిరగొచ్చు..!
ఒక్కోసారి ప్రయాణికులు.. మరోసారి కండక్టర్స్ వల్ల చిల్లరకు పెద్ద ప్రాబ్లమ్ అవుతోంది. కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ దగ్గర నిజంగానే చిల్లర ఉండవు. ఇలా సమస్యల అన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ.

ఆర్జీసీ బస్సుల్లో కొంత మంది కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నప్పుడు చిల్లర సమస్య రావడం సర్వ సాధారణం. ఎవరైనా బస్సు ఎక్కి పెద్ద నోటు ఇస్తే.. చిల్లర లేక గొడవపడటం, ఏకంగా బస్సులోంచి దింపడం లాంటి ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ చిల్లర లేకపోతే.. టికెట్ వెనకాల తర్వాత ఇస్తామంటూ రాసి ఇస్తుంటారు. కొంత మంది కండక్టర్స్ ప్రమేయం లేకుండా.. తమ దిగాల్సిన స్టాప్ రావడంతో హడావుడిగా దిగేస్తుంటారు. దీంతో చిల్లర తీసుకోవడం మరిచిపోతుంటారు. కొంత మంది ప్రయాణికులు ఆయా బస్సు డిపోల దగ్గర వెళ్లి మిగిలిన చిల్లర తీసుకున్న సందర్భాలున్నాయి. ఒక్కోసారి ప్రయాణికులు.. మరోసారి కండక్టర్స్ వల్ల చిల్లరకు పెద్ద ప్రాబ్లమ్ అవుతోంది. కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ దగ్గర నిజంగానే చిల్లర ఉండవు. ఇలా సమస్యల అన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ.
ప్యాసింజర్లకు, కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్‌తో ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్‌లైన్ టికెటింగ్ తీసుకొచ్చామంటున్నారు ఆర్టీసీ అధికారులు. త్వరలోనే మరిన్ని ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకీ వస్తాయని అధికారులు తెలిపారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరగొచ్చని తెలిపింది. అలా అని అకౌంట్‌లో డబ్బులు ఉండాల్సిందే..! దీంతో చిల్లర లేదని ప్రయాణం మధ్యలో బస్సు నుంచి దింపే పరిస్థితి నుంచి ప్రయాణికులకు విముక్తి లభించనుంది.
ప్రస్తుతానికి సిటీలో స్టాపులు దగ్గర దగ్గరగా ఉండడం, బస్సులో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల స్కానింగ్ చేయడం ఆలస్యం అవుతుందని, దానితోపాటు సిగ్నల్ సమస్య కూడా ఉన్నదని కండక్టర్లు అంటున్నారు. బస్సులో సరిగా సిగ్నల్ లేక ఆన్‌లైన్ పేమెంట్ ఆలస్యం అవుతుందని, దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు కండర్టర్లు. సిగ్నల్ ఎక్కువగా ఉండే సిమ్‌లు ఇస్తే ఆ సమస్యను కొంత నివారించ వచ్చని ఆర్టీసీ కండక్టర్లు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..