AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లంచాలకు కక్కుర్తి పడి ఒక్క ఫిబ్రవరి నెలలో ఎంతమంది దొరికిపోయారో తెలుసా?

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ అధికారులపై లంచం డిమాండ్ చేసి వసూలు చేసినందుకు 17 కేసులు నమోదు చేసింది. నమోదైన 17 కేసుల్లో 15 కేసులు ట్రాప్ కేసులు కాగా, రెండు అక్రమ ఆస్తుల కేసులు. ఈ కేసుల్లో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సహా మొత్తం 23 మంది అధికారులను అరెస్టు చేశారు. ఈ ట్రాప్ కేసుల్లో రూ.7.60 లక్షల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది.

లంచాలకు కక్కుర్తి పడి ఒక్క ఫిబ్రవరి నెలలో ఎంతమంది దొరికిపోయారో తెలుసా?
Telangana Acb
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Mar 02, 2025 | 11:21 AM

Share

సమస్యలతో ఉన్న ప్రజలకు సహాయం చేయాల్సిన ప్రభుత్వ అధికారులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటూ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. సమస్య పరిష్కారానికి వెళ్తే అదనంగా లంచాలు తీసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. చేతులు తడిపితే తప్ప సామాన్య ప్రజలకు న్యాయం జరిగని పరిస్థితులు దాపురిస్తున్నాయి. అవి తట్టుకోలేని సామాన్య ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పక్కాగా వలపన్ని అవినీతి చేపలను పట్టేస్తున్నారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 23 మందిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులను ఆస్తులను స్వాధీనం చేసుకుంది ఏసీబీ.

లంచాలకు కక్కుర్తి పడి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. ఈ మధ్యకాలంలో గచ్చిబౌలిలోని విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఏడీ 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ కేసులో విస్తుపోయే అంశాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. నగర శివారులోని శంకర్ పల్లి లో నాలుగు కోట్ల విలువ చేసే భూమితోపాటు రంగారెడ్డి జిల్లాతో పాటుగా హైదరాబాద్‌లో విలువైన ప్లాట్లు, మూడంతస్తుల భవనాలను, బంగారు ఆభరణాలను సైతం ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం వాటి విలువ రూ.100 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేశారు.

అయితే ఒక్క ఫిబ్రవరి నెలలోనే 17 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వీటిలో 15 ట్రాప్ కేసులు కాగా, రెండు ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులతో సహా 23 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ ను తరలించినట్లు ఏసీబీ వెల్లడించింది. అటవీశాఖ, విద్యాశాఖ, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, విద్యుత్ శాఖ, బీసీ సంక్షేమం తోసహా వివిధ శాఖలలో ట్రాప్ కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. వీరి వద్ద నుంచి ఏడు లక్షల అరవై రూపాయల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు రెండు అసమాన ఆస్తుల కేసుల్లో నాలుగు కోట్ల 13 లక్షల 78 వేల 767 విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ప్రకటన ద్వారా కీలక అంశాలను వెల్లడించారు. కాగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా లంచాలకు పాల్పడి సొమ్ము చేసుకుంటే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..