Telangana: కుమ్రంభీమ్ జిల్లాలో పోలీసుల కూంబింగ్.. ప్రతీ ఇళ్లూ చెక్ చేస్తూ..
Telangana: నిన్న నిర్మల్ జిల్లాలో, నేడు కుమ్రంభీమ్ జిల్లాలో పోలీసుల కూంబింగ్ భయాందోళనలు రేపుతోంది. ఇంటింటికీ తిరుగుతూ చెకింగ్స్ చేస్తుండటంతో..
Telangana: నిన్న నిర్మల్ జిల్లాలో, నేడు కుమ్రంభీమ్ జిల్లాలో పోలీసుల కూంబింగ్ భయాందోళనలు రేపుతోంది. ఇంటింటికీ తిరుగుతూ చెకింగ్స్ చేస్తుండటంతో హడలిపోతున్నారు గిరిజనులు. ఒకవైపు మావోయిస్టుల అలజడి, ఇంకోవైపు పోలీసుల కూంబింగ్‌తో ఉమ్మడి ఆదిలాబాద్‌లో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక హడలిపోతున్నారు స్థానికులు. గిరిజన గ్రామాల్లో పోలీసుల కూంబింగ్ భయాందోళనలు రేపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల అలజడి రేగడంతో తుపాకులు చేతబూని గిరిజన గ్రామాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నిన్న నిర్మల్ జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ పర్యటిస్తే, ఇవాళ కుమ్రంభీమ్ జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్ గిరిజన గ్రామాల్లో తిరిగారు. లింగాపూర్ మండలం చోర్‌పల్లి, లెండిగూడ, మందిరిగూడ ప్రాంతాల్లో పర్యటించి గిరిజనులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఇంటింటికీ తిరుగుతూ చెకింగ్స్ కూడా చేశారు పోలీసులు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు సూచనలు సలహాలు ఇచ్చారు కుమ్రంభీమ్ జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్.
మావోయిస్టుల మాయలో పడొద్దని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. యువతీ యువకులెవరూ మావోయిస్టులకు సహకరించొద్దని హెచ్చరించారు. మావోయిస్టు కార్యకాలపాలకు సహకరించి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు ఎస్పీ సురేష్‌కుమార్. మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం ఉందంటోన్న పోలీసులు, ఎవరిపైనైనా అనుమానం వస్తే డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. మావోయిస్టు దళ సభ్యుల కదిలికలపై ఇన్ఫర్మేషన్ ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్‌లో చెప్పాలన్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..