AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Organ Donation: మరణించీ చిరంజీవి ఈ స్టూడెంట్.. తాను మరణిస్తూ పలువురికి ప్రాణదానం..

నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ పెద్ద కుమారుడు, 19ఏళ్ల సాయి తేజ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. కళాశాల నుంచి ద్విచక్ర వాహనంపై హాస్టల్ కు వెళ్తున్న క్రమంలో ఈనెల 26వ తేదీన ఇబ్రహీంపట్నం వద్ద మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Organ Donation: మరణించీ చిరంజీవి ఈ స్టూడెంట్.. తాను మరణిస్తూ పలువురికి ప్రాణదానం..
Student Sai Teja
Boorugu Shiva Kumar
| Edited By: Surya Kala|

Updated on: Jan 31, 2024 | 3:05 PM

Share

అన్నసమర్పణ కడుపు నింపితే…అవయవదానం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఒక వ్యక్తి మరణిస్తే గుండె, మూత్ర పిండాలు, ప్యాంక్రియాస్, కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు, చేతులు, కణజాలం, ఎముకలు ఇలా అవయవాలు దానం చేస్తే దాదాపుగా 8మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఇలా తాను మరణించిన అవయవదానంతో ఆదర్శంగా నిలిచాడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన 19ఏళ్ల సాయి తేజ.

నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి చిదిరే సాయి తేజ హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ పెద్ద కుమారుడు, 19ఏళ్ల సాయి తేజ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. కళాశాల నుంచి ద్విచక్ర వాహనంపై హాస్టల్ కు వెళ్తున్న క్రమంలో ఈనెల 26వ తేదీన ఇబ్రహీంపట్నం వద్ద మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సాయి తేజను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

చికిత్స అనంతరం సాయి తేజ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమారుడు బ్రెయిన్ డెడ్ కావడంతో సాయి తేజ అవయవాలను ఆసుపత్రికి దానం చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అశ్రునయనాల మధ్య సాయి తేజ అంత్యక్రియలు జరిగాయి. చిన్న వయసులో అవయవ దానంతో పలువురి ప్రాణాలు కాపాడడానికి సహకరించిన కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరు అభినందించారు.

ఇవి కూడా చదవండి

కుమారుడు కోల్పోయిన బాధలో సైతం అవయవ దానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయపడ్డారు. అవయువదానం అనంతరం ఆసుపత్రిలో సాయి తేజ మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. తాను మరణించిన ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాడు సాయి తేజ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..