- Telugu News Photo Gallery Spiritual photos Madhya Pradesh: Know Mysterious Facts About Ujjain's Nagchandreshwar Temple
తక్షకుడు కాపలా ఉండే మహామహిమానిత్వ క్షేత్రం.. ఏడాదిలో ఒక్కసారే దర్శనం.. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో ఎక్కడా ఉండదు..
మన దేశంలో ప్రాచీన కాలం నుండి దేవుళ్ళను, దేవతలను మాత్రమే కాదు ప్రకృతిని కూడా పూజిస్తారు. శతాబ్దాలుగా హిందూ మతంలో పాములను పూజించే సంప్రదాయం ఉంది. పాములకు సంబంధించిన ఈ ఆలయాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించారు. ఈ దేవాలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉంది. దీనిని నాగచంద్రేశ్వరాలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఈ ఆలయం గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
Updated on: Jan 31, 2024 | 1:44 PM

భారతదేశంలోని ఏదైనా పాము దేవాలయం గురించి మనం మొదట మాట్లాడుకుంటే, అది ఉజ్జయిని నాగచంద్రేశ్వరాలయం. ఈ ఆలయం ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయంలో మూడవ అంతస్తులో నిర్మించబడింది. నాగచంద్రేశ్వరాలయంలో చాలా పురాతనమైన విగ్రహం ఉంది. ఇలాంటి విగ్రహం ఉజ్జయినిలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.

ఈ భిన్నమైన ఆలయాన్ని ఏడాదికి ఒక్కసారి శ్రావణ శుక్ల పంచమి రోజున మాత్రమే తెరుస్తారు. ఈరోజు నాగేంద్రుడిని దర్శించుకుని పూజించుకోవచ్చు. ఈ ఆలయాన్ని సర్పాలకు రాజు తక్షకుడు కావాలాగా ఉంటాడని భక్తుల నమ్మకం.

ఈ ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన విగ్రహం ఉంది. పడగ ఎత్తిన పాము విగ్రహం మీద శివపార్వతులు కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తారు.

నేపాల్ నుంచి ఈ విగ్రహం ఇక్కడకు తీసుకు వచ్చినట్లు.. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేనట్లు చెబుతారు. ఎందుకంటే మహావిష్ణువు మాత్రమే శేషతల్పంపై పావళిస్తారు. అయితే ఇక్కడ శివుడు సర్పంమీద దర్శనం ఇస్తున్నాడు.

అంతేకాదు ఈ ఆలయంలో నాగ సర్పాన్ని ఆసనంగా చేసుకుని ఆదిదంపతులు శివపార్వతులు మాత్రమే కాదు విఘ్నలకధిపతి గణపయ్య ఉండడం కూడా దర్శనం ఇస్తాడు.

పరమేశ్వరుని అనుగ్రహం కోసం తక్షకుడు సర్పాకారంలో కఠినమైన తపస్సు చేశాడు. తపస్సుని మెచ్చుకున్న శివుడు తక్షకునికి అమరత్వాన్ని వరంగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ఆలయంలో శివుడితో పాటు తక్షకుడు ఉన్నాడని స్థానికుల కథనం.

1050 సంవత్సరంలో భోజరాజు నాగచంద్రేశ్వర దేవాలయాన్ని నిర్మించగా.. సింధియా వంశానికి చెందిన రాణోజీమహారాజ్ దేవాలయాన్ని జీర్ణోద్ధారణ చేశాడట. ఏడాదికి ఒక్కసారి తెరచే ఈ ఆలయంలో విగ్రహాన్ని దర్శిస్తే చాలు.. సర్పదోషాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం.




