- Telugu News Photo Gallery Spiritual photos Lord Shani dev saturn will make these zodiac signs rich and happy check details here
Shani Dev: క్రమంగా పెరుగుతున్న శనీశ్వరుడి బలం.. ఆ రాశుల వారికి ఇక వరాల వర్షం..!
ప్రస్తుతం తన స్వక్షేత్రమైన కుంభ రాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడికి క్రమంగా బలం పెరుగు తోంది. ప్రస్తుతం రాహు నక్షత్రమైన శతభిషంలో సంచరిస్తున్న శనీశ్వరుడు ఎటువంటి దోషమూ లేకుండా స్వేచ్ఛగా ఫలితాలనివ్వడం జరుగుతుంది. దీనివల్ల శని దోషంతో ఇబ్బంది పడుతున్న కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశివారు ఈ ఏడాదంతా ఊహించని లాభాలు, ప్రయోజనాలు పొందడం జరుగుతుంది.
Updated on: Jan 30, 2024 | 7:04 PM

Lord Shani

కర్కాటకం: సాధారణంగా అష్టమ శని వల్ల ప్రతి పనీ ఆలస్యం కావడం, ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడక నడవడం, రావలసిన డబ్బు చేతికి అందకపోవడం, మధ్య మధ్య అనారోగ్యాలు పీడించడం వంటివి జరుగుతాయి. అయితే, ఫిబ్రవరి 1 తేదీ నుంచి ఈ రాశివారికి ఈ దోషాలేవీ అంటకపోగా, ఆదాయం క్రమంగా పెరగడం, గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడం, అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనివ్వడం వంటివి జరుగుతాయి. తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది.

సింహం: సప్తమ శని వల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో, ఆదాయ వృద్ది ప్రయత్నాల్లో ఏదో ఒక ఇబ్బంది, ఆటంకం ఉంటూ ఉంటుంది. శీఘ్రగతిన పురోగతి చెందడం కష్టమవుతుంది. అన్ని పనులూ పెండింగులో పడతాయి. ఈ దోషాలన్నీ తొలగిపోయి, కొత్త జీవితం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం కావడం ప్రారంభం అవుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు అనూహ్యమైన ఫలితాలనిస్తాయి.

వృశ్చికం: ఈ రాశివారికి అర్ధాష్టమ శని దోషం చాలావరకు తొలగిపోతుంది. కుటుంబ, ఆస్తి సంబంధమైన వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. ఆస్తుల క్రయ విక్రయాలకు మార్గం సుగమం అవుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులు సానుకూలమవు తాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.

మకరం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా ప్రతి ఆర్థిక ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో డిమాండు పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. సర్వత్రా మాట చెల్లుబాటవుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు సైతం మంచి అవకాశాలు అందివస్తాయి. విద్యార్థులు కూడా ఘన విజయాలు సాధిస్తారు.

కుంభం: ఈ రాశివారికి గత మూడున్నరేళ్లుగా పీడిస్తున్న ఏలిన్నాటి శని మరో ఏడాదిన్నర పాటు బాగా తగ్గి ఉండే అవకాశం ఉంది. ఫలితంగా ప్రతి పెండింగు పనీ పూర్తి కావడం, రావలసిన డబ్బు చేతికి అందడం, ఆస్తి వివాదం పరిష్కారం కావడం, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. డబ్బును దాచుకోగల, మిగల్చుకోగల స్థితికి చేరుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శించుకుంటారు.

మీనం: ఈ రాశివారికి ఏడాది కాలంగా పీడిస్తున్న ‘వ్యయ’ శని చాలావరకు తన ప్రభావాన్ని తగ్గించే సూచనలున్నాయి. విదేశీయానం, పుణ్య క్షేత్ర దర్శనం, శుభకార్యాలు, పిల్లల చదువులు, వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు వంటివి బాగా అనుకూలంగా నెరవేరుతాయి. మనసులోని కోరికల్లో చాలా భాగం సాకారమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ బాగా కలిసి వచ్చి, క్రమంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.



