AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కాన్సర్‌తో మరణించిన తల్లి.. ఇప్పుడు తండ్రికి కాన్సర్.. కన్నీరు పెట్టిస్తున్న తనయుడు ప్రేమ

క్యాన్సర్ తో బాధపడుతున్న తనను  చికిత్స సమయంలో తన కొడుకు తనను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో .. అందుకు తన కొడుకు తన ఆనందాన్ని త్యాగం చేశాడని.. ఇందుకు సర్వదా కృతజ్ఞురాలునని ఆ తల్లి లేఖ ద్వారా తన భావాలను వ్యక్తం చేసింది. ఏదో ఒక రోజు నీకు ఈ ఉత్తరం అందుతుందని ఆశతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను అని ఆ లేఖలో తల్లి కూడా రాసింది. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసని ఆశిస్తున్నాను.

Viral News: కాన్సర్‌తో మరణించిన తల్లి.. ఇప్పుడు తండ్రికి కాన్సర్.. కన్నీరు పెట్టిస్తున్న తనయుడు ప్రేమ
Mothers Love News
Surya Kala
|

Updated on: Jan 31, 2024 | 12:54 PM

Share

తల్లిదండ్రులే తాము కొవ్వొత్తిలా కరుగుతూ తమ పిల్లల జీవితంలో వెలుగులు నింపుతారు. తమ పిల్లలు నవ్వుతూ సంతోషముగా జీవిస్తుంటే అది చూసిన తల్లిదండ్రుల హృదయం ఉప్పొంగిపోతుంది. తమ  పిల్లలను ప్రేమించడమే కాదు వారికి అన్ని వేళలా సపోర్ట్ గా నిలుస్తారు కూడా. అయితే ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలను పోగొట్టుకుంటే అప్పుడు వారు పడే బాధ వర్ణనాతీతం. పిల్లలు తమతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కకన్నీరు పెడుతూ జీవితాన్ని గడిపేస్తారు. అదే విధంగా ప్రతి బిడ్డకూ తమ తల్లిదండ్రులంటే అపురూపమే.. వారిని ప్రేమిస్తారు. జీవితాంతం తమతో ఉండాలని కోరుకుంటారు. అయితే  తాజాగా ఓ తల్లి పిల్లల అనుబంధానికి సంబంధించిన ఓ లేఖ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి క్యాన్సర్‌తో చనిపోయే ముందు తన తల్లి .. తనకు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ లేఖ హృదయాన్ని హత్తుకోవడమే కాదు.. కన్నీరు పెట్టిస్తుంది కూడా..

క్యాన్సర్ తో బాధపడుతున్న తనను  చికిత్స సమయంలో తన కొడుకు తనను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో .. అందుకు తన కొడుకు తన ఆనందాన్ని త్యాగం చేశాడని.. ఇందుకు సర్వదా కృతజ్ఞురాలునని ఆ తల్లి లేఖ ద్వారా తన భావాలను వ్యక్తం చేసింది. ఏదో ఒక రోజు నీకు ఈ ఉత్తరం అందుతుందని ఆశతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను అని ఆ లేఖలో తల్లి కూడా రాసింది. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసని ఆశిస్తున్నాను. వాస్తవానికి, కొడుకు తన తల్లి మరణం తరువాత ఈ లేఖను అందుకున్నాడు. అది చదివి అతను కూడా భావోద్వేగానికి గురయ్యాడు.

భావోద్వేగంతో కూడిన ఈ లేఖ వైరల్ అవుతోంది

A letter from my mom that I found after she passed away from cancer byu/MattGald inMadeMeSmile

ఇవి కూడా చదవండి

మాట్ గాల్డ్ అనే వ్యక్తి ఈ లేఖను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పంచుకున్నాడు. తన తల్లి క్యాన్సర్‌తో మరణించిన తర్వాత తాను ఈ లేఖను అందుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తాను ప్రతిరోజూ తల్లిని మిస్ అవుతున్నానని .. తనకు చాలా ఏడుపు వస్తుందని వెల్లడించాడు. ప్రస్తుతం తన సమయం చాలా కష్టంగా ఉంది.. ఎందుకంటే ఇప్పుడు తన తండ్రి కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నాడని.. చికిత్స నిమిత్తం ICUలో ఉన్నారని తెలిపాడు. మీరు ఇష్టపడే వ్యక్తులకు.. మీ ప్రేమని ఇష్టాన్ని చెప్పండి. ప్రతి రోజూ మీరు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నట్లు మీ చర్యల ద్వారా ప్రకటించండి.

ఆ తల్లి తన లేఖలో తన కొడుకు తనను ఎలా చేసుకున్నాడో తెలుపుతూ.. ఎపుడూ తనతో ఉండేవాడని… పిలిస్తే పలికేవాడని చెప్పింది. అంతేకాదు ఉద్యోగం మానేస్తే ఆదాయం మార్గం ఉండదు అని తెలిసి కూడా తనను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకుని వెళ్ళడానికి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన తన కొడుకు ప్రేమకి థాంక్స్ చెప్పింది. నా మరణం కంటే.. నిన్ను విడిచి పెట్టి వెళ్ళిపోతున్నాను అన్న భయం తనను వెంటాడుతోందని నువ్వు ప్రపంచంలో ఉత్తమ కుమారుడివి అని చెప్పింది. తన కొడుకుతో గడిపిన ఉత్తమ క్షణాలను కూడా ఆ తల్లి లేఖలో పేర్కొంది.

ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అది చదివిన ప్రజలు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఒకరు  ‘మీ తల్లికి అవసరమైన సమయంలో మీరు ఇచ్చిన ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మీరు అద్భుతమైన వ్యక్తి అని నేను చెప్పగలను అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు ‘నేను నిజంగా మీ పరిస్థితికి    చాలా విచారిస్తున్నాను.. అయితే నేను సంతోషంగా ఉన్నాను.. నీలాంటి కొడుకు తల్లిదండ్రులకు ఉన్నందుకు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

మరిన్ని వైరల్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..