Twin Sisters: పుట్టిన వెంటనే విడిపోయారు.. 19 ఏళ్లకు కలిశారు. అది టిక్ టాక్ ద్వారా..

Twin Sisters: పుట్టిన వెంటనే విడిపోయారు.. 19 ఏళ్లకు కలిశారు. అది టిక్ టాక్ ద్వారా..

Anil kumar poka

|

Updated on: Jan 31, 2024 | 11:45 AM

సోషల్‌ మీడియా పుట్టినప్పుడే దూరమైన ఇద్దరు కవలపిల్లలను ఒక్కటి చేసింది. అదికూడా 19 ఏళ్ల తర్వాత. అవును..వారిద్దరు కవలలు.. అనుకోని పరిస్థితుల్లో పుట్టినప్పుడే విడిపోయారు.. 19 ఏళ్లుగా పక్క పక్క వీధుల్లోనే ఉంటున్నా ఒకరంటే ఒకరికి తెలియదు. తాజాగా ఓ టిక్‌టాక్‌ వీడియో, టీవీ షో వారిద్దరిని కలిపాయి. జార్జియాకు చెందిన కవలలు అమీ క్విటియా, అనో సార్టానియా పుట్టగానే కన్న తండ్రి వారిద్దరిని అమ్మేశాడు. ఒకే పట్టణంలో నివసిస్తున్నా ఎప్పుడూ ఒకరికొకరు తారసపడలేదు.

సోషల్‌ మీడియా పుట్టినప్పుడే దూరమైన ఇద్దరు కవలపిల్లలను ఒక్కటి చేసింది. అదికూడా 19 ఏళ్ల తర్వాత. అవును..వారిద్దరు కవలలు.. అనుకోని పరిస్థితుల్లో పుట్టినప్పుడే విడిపోయారు.. 19 ఏళ్లుగా పక్క పక్క వీధుల్లోనే ఉంటున్నా ఒకరంటే ఒకరికి తెలియదు. తాజాగా ఓ టిక్‌టాక్‌ వీడియో, టీవీ షో వారిద్దరిని కలిపాయి. జార్జియాకు చెందిన కవలలు అమీ క్విటియా, అనో సార్టానియా పుట్టగానే కన్న తండ్రి వారిద్దరిని అమ్మేశాడు. ఒకే పట్టణంలో నివసిస్తున్నా ఎప్పుడూ ఒకరికొకరు తారసపడలేదు. ఓ రోజు అమీ ఓ టీవీ షో చూస్తుండగా, తన పోలికతో ఓ అమ్మాయి డ్యాన్స్‌ చేస్తుండటాన్ని చూసి షాక్‌ అయ్యింది. అమీకి కూడా డ్యాన్స్‌ అంటే ప్రాణం. డ్యాన్స్‌ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్‌టాక్‌ వీడియో తీసి అప్‌లోడ్‌ చేసింది. అది తెగ వైరల్‌ అయింది. దానిని అమీ సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్‌ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్‌ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టులు పెట్టేది. ఈ గ్రూప్‌లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్‌ నంబర్‌ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది.

కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్‌సైట్లు, గ్రూప్‌లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్‌బుక్‌ పేజీని ప్రారంభించింది. ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్‌.. అమీకి ఫోన్‌ చేసింది. తన తల్లి 2002లో ఓ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చిందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్‌ఏ టెస్ట్‌లు చేయించింది. అవి తమ డీఎన్‌ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్‌ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. కోమానుంచి కోలుకున్న తర్వాత పిల్లలు చనిపోయారని తన భర్త చెప్పాడని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos