Viral: విమానం టేకాఫ్‌ ఆలస్యం.. ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి వెళ్లిపోయిన ప్రయాణికుడు.!

Viral: విమానం టేకాఫ్‌ ఆలస్యం.. ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి వెళ్లిపోయిన ప్రయాణికుడు.!

Anil kumar poka

|

Updated on: Jan 31, 2024 | 8:04 AM

ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికులు కొందరు విమానాల్లో ప్రయాణించే సమయంలో ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నారు. విమానం గాల్లో ఎగురుతుండగా ఎమర్జెన్సీ డోర్‌లు తెరవడం లాంటి ఘటనలు మనం చూశాం. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానం అత్యవసర ద్వారాన్ని తెరిచి దాని రెక్కపై నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు ఓ ప్రయాణికుడు. గురువారం మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికులు కొందరు విమానాల్లో ప్రయాణించే సమయంలో ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నారు. విమానం గాల్లో ఎగురుతుండగా ఎమర్జెన్సీ డోర్‌లు తెరవడం లాంటి ఘటనలు మనం చూశాం. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానం అత్యవసర ద్వారాన్ని తెరిచి దాని రెక్కపై నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు ఓ ప్రయాణికుడు. గురువారం మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏరోమెక్సికో (AeroMexico)కు చెందిన AMమ్‌672 విమానం గ్వాటెమాలాకు ఉదయం 8.45 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల దాని టేకాఫ్‌ ఆలస్యమైంది. 4 గంటలకు పైగా విమానంలోనే కూర్చున్న ప్రయాణికులు చాలా ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచాడు. విమానం రెక్కపై నడుచుకుంటూ బయటకు వెళ్లాడు. కొద్ది సమయం తర్వాత తిరిగి అతడు విమానంలోకి వచ్చినట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.ఈ ఘటనపై స్పందించిన ప్రయాణికులు తాము విమానంలో సరైన గాలి, నీరు లేక ఇబ్బంది పడినట్లు తెలిపారు. అతడు మంచి పని చేశాడంటూ మద్దతు ఇచ్చారు. కాగా, దీనిపై ఎయిర్‌లైన్స్‌ ఇంకా స్పందించలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos