Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లే మహిళలు బస్ టికెట్ కొనాలా? సర్కారు క్లారిటీ.!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీము సాధారణ రోజుల్లోనే కాకుండా పండుగలు, పర్వదినాలలోనూ వర్తిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో మేడారం జాతర జరగబోతోంది. ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ క్రమంలో మేడారం జాతర సమయంలో మహిళల నుంచి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీము సాధారణ రోజుల్లోనే కాకుండా పండుగలు, పర్వదినాలలోనూ వర్తిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో మేడారం జాతర జరగబోతోంది. ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ క్రమంలో మేడారం జాతర సమయంలో మహిళల నుంచి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళల నుంచి టికెట్ వసూలు చేయరాదని స్పష్టం చేశారు.
రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి భట్టి విక్రమార్క, రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న మేడారం జాతర సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి టికెట్ వసూలు చేస్తే సంస్థ ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన భట్టి.. అది సరికాదని, ఎట్టిపరిస్థితుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక్క మేడారమే కాదని, ఏ జాతర సమయంలోనూ మహిళల నుంచి టికెట్ వసూలు చేయవద్దని ఆదేశించారు. వచ్చే నెల 18 నుంచి 25 వరకు జరగనున్న మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 6 వేల బస్సులు నడపాలని నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచే 2 వేల బస్సులను సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

