Masa Shivaratri: మాస శివరాత్రి విశిష్టత.. ఉపవాసం చేయడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి..

భవిష్య పురాణం ప్రకారం మాస శివరాత్రి తిథి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మాస శివరాత్రి ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి తేదీన వస్తుంది. ఈ తిథికి అధిపతి శివుడు. ఈ రోజున శివుని పూజతో .. శివ పార్వతులను పూజిస్తారు. సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ ఉపవాసం చేస్తారు. ఈ రోజున శివలింగానికి పూలు సమర్పించడం శివ మంత్రాలను పఠించడం విశిష్టత. ఈ రోజున పరమశివుని పూజించి పూర్ణ క్రతువులతో ఉపవాసం ఉంటారు. ఈ వ్రత ప్రభావం వలన కామం, క్రోధం, దురాశ, అనుబంధం మొదలైన బంధాల నుండి విముక్తి పొందుతాడు.

Masa Shivaratri: మాస శివరాత్రి విశిష్టత.. ఉపవాసం చేయడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి..
Masa Shivaratri
Follow us

|

Updated on: Jan 31, 2024 | 2:51 PM

శివరాత్రి రోజునే లింగోద్భవం జరిగిన రోజుగా హిందువుల విశ్వాసం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మాస శివరాత్రిని ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. నెలవారీ శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శంకరుడు సంతోషిస్తాడని నమ్మకం. లక్ష్మీదేవి, సరస్వతి, ఇంద్రాణి, గాయత్రి, సావిత్రి, పార్వతి దేవి మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివుని అనుగ్రహంతో అనంతమైన ఫలితాలను పొందారని శాస్త్రాల ఉవాచ. ఈ నెల మాఘ మాసశివరాత్రి 8 ఫిబ్రవరి 2024 గురువారం రోజున జరుపుకోవడానికి భక్తులు విశ్వాసం. చతుర్దశి రోజు రాత్రి పార్వతీ దేవిని శివుడు వివాహం చేసుకున్నాడని  విశ్వాసం. అందువల్ల మాసశివరాత్రి నాడు రాత్రిపూట పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

మాస శివరాత్రి విశిష్టత

భవిష్య పురాణం ప్రకారం మాస శివరాత్రి తిథి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మాస శివరాత్రి ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి తేదీన వస్తుంది. ఈ తిథికి అధిపతి శివుడు. ఈ రోజున శివుని పూజతో .. శివ పార్వతులను పూజిస్తారు. సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ ఉపవాసం చేస్తారు. ఈ రోజున శివలింగానికి పూలు సమర్పించడం శివ మంత్రాలను పఠించడం విశిష్టత. ఈ రోజున పరమశివుని పూజించి పూర్ణ క్రతువులతో ఉపవాసం ఉంటారు. ఈ వ్రత ప్రభావం వలన కామం, క్రోధం, దురాశ, అనుబంధం మొదలైన బంధాల నుండి విముక్తి పొందుతాడు.

మాస శివరాత్రి ఉపవాస ప్రయోజనాలు

శివాలయంలో లేదా ఇంటి తూర్పు దిక్కున కూర్చుని శివ మంత్రాలను పఠించడం వల్ల విశేష ఫలితం లభిస్తుందని నమ్మకం. నెలవారీ శివరాత్రి పూజ తర్వాత బ్రాహ్మణుల అన్న సమర్పణ చేయండి. ఎవరైనా  మాస శివరాత్రి వ్రతాన్ని సంపూర్ణ భక్తితో ఆచరిస్తారో అతని తల్లిదండ్రులు చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అదే సమయంలో కష్టాలు తొలగిపోతాయి.. జీవితంలోని అన్ని ఆనందాలను పొందుతాడని విశ్వాసం. ఈ వ్రత మహిమతో మనిషి దీర్ఘాయువు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం మొదలైనవాటిని పొందుతాడు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

నెలవారీ శివరాత్రి పూజ ఎలా చేయాలి?

మాస శివరాత్రి రోజున ఉపవాసంలోచేసి శివునితో పాటు, తల్లి పార్వతి, గణపతి, కార్తికేయుడు శివగణాలను పూజిస్తారు. శివుని ఆరాధనలో పరమశివుని ప్రతిష్టించి పాలు, పెరుగు, తేనె, నీరు, పంచదార, గంగాజలం,  చెరకు రసం మొదలైన వాటితో అభిషేకం చేయండి. అభిషేకం అనంతరం బిల్వ పత్రం, దర్భతో సమర్పించి శివుడిని ప్రసన్నం చేసుకోండి. ఉమ్మెత్త,  కొబ్బరి మొదలైనవి నైవేద్యంగా శివునికి సమర్పించండి.  మాస శివరాత్రి నాడు రోజంతా ఉపవాసం పాటించి నెలవారీ శివరాత్రి నాడు రాత్రి పూజ చేయడం  మంత్రాలను పఠించడం ఫలవంతంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు