Vastu Tips for Tulsi: తులసి మొక్క నుంచి ఆకులను తీసుకునేందుకు ఈ నియమాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

విష్ణువు, కృష్ణుడికి  సమర్పించే నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. వివిధ అవసరాల కోసం తులసి ఆకులను మొక్క నుంచి తుంచుతారు. అయితే తులసి ఆకులను మొక్క నుంచి తీయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. తులసి ఆకులతో ఏ పని లేకపోతే వాటిని మొక్క నుంచి ఆకులను తీయడం అశుభం. ఇలా చేయడం వలన లక్ష్మి దేవికి కోపం వస్తుందని అని నమ్మకం.

Vastu Tips for Tulsi: తులసి మొక్క నుంచి ఆకులను తీసుకునేందుకు ఈ నియమాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Tulasi Tree 4
Follow us
Surya Kala

|

Updated on: Feb 01, 2024 | 7:38 AM

తులసి మొక్కకు హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. దైవంగా భావించి తులసిని ప్రతి ఇంట్లో పూజిస్తారు. తులసిని విష్ణువుకు చాలా ప్రియమైనదిగా భావిస్తారు.  తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం.  అందుకనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సాయంత్రం వేళ అనేక మంది తమ ఇంటిలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తారు. తులసి మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో తులసి ఆకులను అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ తులసి ఆకుల ప్రత్యేక లక్షణాల కారణంగా.. ఆకులను పూజలో కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడికి  సమర్పించే నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. వివిధ అవసరాల కోసం తులసి ఆకులను మొక్క నుంచి తుంచుతారు. అయితే తులసి ఆకులను మొక్క నుంచి తీయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. తులసి ఆకులతో ఏ పని లేకపోతే వాటిని మొక్క నుంచి ఆకులను తీయడం అశుభం. ఇలా చేయడం వలన లక్ష్మి దేవికి కోపం వస్తుందని అని నమ్మకం.

బ్రహ్మ ముహూర్తంలో

తులసి ఆకులను మొక్క నుంచి తెంచడానికి సరైన సమయం బ్రహ్మ ముహూర్తంగా పరిగణించబడుతుంది. తులసి ఆకులను తీయడానికి ముందు స్నానం చేసి మీకు ఇష్టమైన దేవుడిని పూజించండి. అనంతరం తులసికి పూజ చేయండి. ఆకులను తీయడానికి తులసి మొక్క అనుమతి తీసుకోండి. ఒకేసారి గరిష్టంగా 21 ఆకులను మాత్రమే తెంచండి. ఇలా చేయడం వల్ల తులసి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి.

తులసి పూజ, ప్రార్థన

తులసి ఆకులను ఎలా బడితే అలా ఏ సమయంలో బడితే ఆ సమయంలో తెంచరాదు. సనాతన ధర్మంలోని  నమ్మకాల ప్రకారం తులసి ఆకులను మొక్క నుంచి తెంచడానికి ముందు.. తులసిమాతను ప్రార్ధించి..  ఆకులను కావాల్సినంత వరకు మాత్రమే తీసుకుంటానని అందుకు మీ అనుమతి ఇవ్వండి అంటూ కోరుకోవాలి. అయితే తులసి ఆకులను తెంచడానికి ముందు.. ఒక మంత్రాన్ని జపించాలి. అనంతరం  తులసి ఆకులను తెంపవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఏ మంత్రం పఠించాలంటే

मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी.. नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते ।। (ఓ తులసీ మాతా, ఓ గోవిందా, నీవు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తున్నావు నారాయణుడిని ఆరాధించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, కనుక నీ ఆకులు తీసుకునేందుకు అనుమతినివ్వు మీకు నా ప్రణామాలు). అంటూ తులసి ఆకులను తీయడానికి ముందు మంత్రాన్ని జపించాలి. తులసి ఆకులను తెంచినప్పుడు మాతా తులసి గోవింద హృదయానంద కారిణి నారాయణస్య పూజార్థం చినోమి త్వాం । _ మతసత్తుల్సీ గోవింద్ హృదయానందకారిణి అంటూ ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. 21 ఆకులను మాత్రమే తీసుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?