AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gyanvapi: దాదాపు 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపి దగ్గర పూజలు.. తెల్లవారుజాము నుంచే బేస్‌మెంట్‌లో మొదలు

జ్ఞానవాపి ప్రాంగణంలో సర్వే నిర్వహించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో ఒక భారీ హిందూ ఆలయం ఉండేదని, దాన్ని కూల్చి వాటి శిథిలాలతో మసీదు నిర్మించారని నివేదికను వెలువరించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే తాజాగా జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Gyanvapi: దాదాపు 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపి దగ్గర పూజలు.. తెల్లవారుజాము నుంచే బేస్‌మెంట్‌లో మొదలు
Gyanvapi Temple
Balaraju Goud
|

Updated on: Feb 01, 2024 | 8:00 AM

Share

అయోధ్యనే కాదు.. కాశీ కూడా హిందూవులదే..! వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్న జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్ ప్రాంతంలో శివుడికి పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇటీవలె జ్ఞానవాపి ప్రాంగణంలో సర్వే నిర్వహించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో ఒక భారీ హిందూ ఆలయం ఉండేదని, దాన్ని కూల్చి వాటి శిథిలాలతో మసీదు నిర్మించారని నివేదికను వెలువరించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే తాజాగా జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆదేశాలపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్‌ ట్రస్టుకు ఈ పూజల బాధ్యతలు అప్పగించింది..సోమనాథ్ వ్యాస్ కుటుంబం1551 నుంచి అర్చక సేవలో కొనసాగుతోంది..పిటిషనర్‌ శైలేంద్ర తాత,పూజారి సోమ్‌నాథ్‌ వ్యాస్‌ గతంలో ఈ సెల్లార్‌లోనే 1993 డిసెంబర్‌ దాకా పూజలు చేశారు. ఆ క్రమంలోనే ఇక్కడ పూజలు చేసుకునే హక్కులు తమకు దక్కుతాయంటూ ఆయన కోర్టు ఆశ్రయించారు. మసీదులో చిన్న కొలను వజూఖానా ముందున్న నంది విగ్రహం వద్ద ∙బ్యారీకేడ్లను తొలగించాలని, పూజలకు మార్గంసుగమం చేయాలని జడ్జి ఆదేశించారు..

కోర్టు ఆదేశాలతో తెల్లవారుజామునే జ్ఞానవాపికి చేరుకున్న పూజారులు,భక్తులు శివయ్యకు పూజలు ప్రారంభించారు..వారణాసిలోని జ్ఞానవాపి దగ్గర ఓ పండుగ వాతావరణం నెలకొంది..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!