AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Temple: రామాయణ, హనుమన్ చాలీసా పారాయణాన్ని వినడానికి వచ్చే వానర సైన్యం.. అద్భుతాలయం ఎక్కడ ఉందంటే..

హిందూ మతంలో మంగళవారం శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడికి అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో అంగారక గ్రహం ( కుజ గ్రహ) స్థానం బలపడటానికి మంగళవారం నాడు హనుమంతుడిని పూజించే సంప్రదాయం ఉంది. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయని మత విశ్వాసం. వృత్తి, వ్యాపారాలలో కూడా పురోగతి ఉంటుంది. హనుమంతుడి ఈ ఆలయం చాలా పురాతనమైనది. ప్రసిద్ధమైనది. ఈ స్థలానికి చెందిన కొన్ని ప్రత్యేకతల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Hanuman Temple: రామాయణ, హనుమన్ చాలీసా పారాయణాన్ని వినడానికి వచ్చే వానర సైన్యం.. అద్భుతాలయం ఎక్కడ ఉందంటే..
Jabalpur Hanuman Temple
Surya Kala
|

Updated on: Feb 01, 2024 | 9:05 AM

Share

రామ భక్తుడు సంకట మోచనుడు హనుమంతుడు చిరంజీవి. కలియుగాం లో కూడా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఎక్కడ రామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని విశ్వాసం. ఆయన ఎప్పుడూ ఏదో ఒక రూపంలో భక్తులకు తన ఉనికిని తెలియజేస్తూనే ఉంటారని చెబుతారు. దేశంలో ఎన్నో హనుమంతుని ఆలయాలున్నాయి. ఎంతో భక్తిశ్రద్దలతో హనుమంతుడ్ని పూజిస్తారు. అంతేకాదు  భారీ సంఖ్యలో హనుమంతుడి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే నర్మదా నది ఒడ్డున ఉన్నఒక  హనుమాన్ ఆలయ అన్ని ఆలయాలకంటే ప్రత్యేకమైనది. ఎందులకంటే ఈ గుడిలో పూజలను అందుకుంటున్న హనుమంతుడు భక్తులపై సింధూర రూపంలో ఆశీర్వాదాలను కురిపిస్తాడు.

హిందూ మతంలో మంగళవారం శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడికి అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో అంగారక గ్రహం ( కుజ గ్రహ) స్థానం బలపడటానికి మంగళవారం నాడు హనుమంతుడిని పూజించే సంప్రదాయం ఉంది. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయని మత విశ్వాసం. వృత్తి, వ్యాపారాలలో కూడా పురోగతి ఉంటుంది.

ఈ ఆలయం జబల్‌పూర్‌లోని తిల్వారా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఆలయం నిత్యం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది.  వేలాది మంది భక్తులు హనుమంతుడిని పూజించడానికి వస్తారు. ఈ ఆలయానికి జబల్పూర్ నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. హనుమంతుడి ఈ ఆలయం చాలా పురాతనమైనది. ప్రసిద్ధమైనది. ఈ స్థలానికి చెందిన కొన్ని ప్రత్యేకతల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

రామాయణం వినడానికి వచ్చే కోతులు

ఆలయంలో హనుమాన్ చాలీసా లేదా రామాయణం పఠించినప్పుడల్లా శ్రీరాముని వానర సైన్యం వచ్చి ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా,  రామాయణ పారాయణాలను పూర్తి శ్రద్ధతో వింటాయని ఈ ఆలయ పూజారి చెప్పారు. పారాయణ సమయంలో మాత్రమే కోతులు వస్తాయని, పారాయణం విని వెళ్లిపోతాయన్నారు. అంతేకాదు అప్పుడు ఆలయంలో ఉన్న ఏ భక్తుడిని ఇబ్బంది పెట్టవు. గంతులు వేయకుండా అత్యంత భక్తి శ్రద్దలతో పారాయణం విని అనంతరం మళ్ళీ తమ స్థానాలకు వెళ్ళిపోయితాయని చెప్పారు.

దర్శనం కోసం వచ్చే నర్మదాదేవి

పురాణాల విశ్వాసాల ప్రకారం హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం. మంగళవారం రోజున ఈ ఆలయంలోని హనుమంతుడికి సింధూరం పూయడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని చెబుతారు. జబల్‌పూర్‌లోని తిల్వారా ఘాట్‌లో ఉన్న సంకట మోచన హనుమాన్ ఆలయ పూజారి దామోదర్ దాస్ మాట్లాడుతూ నర్మదా నదీ తీరంలో ఉన్న ఈ ఆలయం.. మిగిలిన ఆలయాలన్నింటి కంటే ప్రత్యేకం అని తెలిపారు. హనుమంతుని దర్శనం కోసం తల్లి నర్మదాదేవి స్వయంగా ఇక్కడికి వస్తుందని చెబుతారు. ఈ ఆలయానికి ఉదయం వచ్చిన ఎవరైనా సరే దర్శనం చేసుకుని వెంటనే వెళ్లిపోతారని చెబుతారు.

మహిళలకు అనుమతి లేదు

పూజారి ప్రకారం హనుమంతుడు బ్రహ్మచారి. పురాణ శాస్త్రాల ప్రకారం స్త్రీలు హనుమంతుడిని తాకరాదు.  అందువల్ల ఆలయంలోని హనుమంతుని విగ్రహం చుట్టూ పారదర్శక నీడను ఏర్పాటు చేశారు, తద్వారా మహిళలు హనుమంతుని విగ్రహాన్ని తాకలేరు. దేవాలయాల్లోని హనుమంతుడి విగ్రహాన్ని మహిళలు తాకకూడదని దీని కారణంగా ఆయన విగ్రహం చుట్టూ 24 గంటలూ పారదర్శక నీడ ఉంటుందని పూజారి తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు