AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODOP Awards: ఏపీకి ఓడీఓపీలో అవార్డుల పంట.. హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్.. ఏ విభాగంలో అవార్డులు అందుకుందంటే..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం.. ప్రత్యేకించి చేతివృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమం కళాకారుల జీవనోపాధిని కూడా కాపాడి.. ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. వన్‌ డిస్ట్రిక్ట్‌- వన్‌ ప్రొడక్ట్‌లో ఆంధ్రప్రదేశ్ కు అవార్డుల పంట పండింది.

ODOP Awards: ఏపీకి ఓడీఓపీలో అవార్డుల పంట.. హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్.. ఏ విభాగంలో అవార్డులు అందుకుందంటే..
Odop Awards 2024
Surya Kala
|

Updated on: Feb 01, 2024 | 6:24 AM

Share

వన్‌ డిస్ట్రిక్ట్‌- వన్‌ ప్రొడక్ట్‌లో ఆంధ్రప్రదేశ్ కు అవార్డుల పంట పండింది. ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. కేంద్రం చేపట్టిన ఓడీఓపీలో ఒక్క ఏపీకే ఆరు అవార్డులు రావటంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ అభినంధించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ జమ్‌దానీ చీరలు, అరకు కాఫీకి బంగారు పతకాలు వచ్చాయి. పొందూరు కాటన్‌, కోడుమూరు గద్వాల్‌ చీరలకు కాంస్య పతకాలు లభించాయి. అదేవిధంగా.. మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం.. ప్రత్యేకించి చేతివృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమం కళాకారుల జీవనోపాధిని కూడా కాపాడి.. ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక.. సామాజిక, ఆర్థిక అభివృద్దిని ప్రోత్సహించడమే లక్ష్యంగా దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వన్‌ డిస్ట్రిక్ట్‌- వన్‌ ప్రొడక్ట్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ కార్యక్రమంలో భాగంగా.. ఏపీకి ఆరు అవార్డులు దక్కడంతో.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వాటి వివరాలు తెలియజేశారు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు. అయా విభాగాల అధికారులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయా అవార్డులు అందుకున్నారు ఏపీ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్