AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price: రైతు కంట కన్నీరు.. భారీగా పడిపోయిన ఉల్లి ధర.. కిలో రూ.3 అమ్మకం

ఉల్లి ధరలు భారీగా పతనం కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కిలో ఉల్లి రూ.2లకు పడిపోయింది. దీంతో రైతులు పంటకు పెట్టిన పెట్టుబడి మాట అటు ఉంచి మార్కెట్ కు తరలించిన రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. వాస్తవంగా కొన్ని నెలల క్రితం వరకూ ఉల్లి ధర బాగానే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఉల్లి ధర నెల చూపులు చూస్తూ.. ఇప్పుడు అకస్మాత్తుగా రెండు రూపాయలకు పడిపోయింది. దీంతో రైతుకు దిక్కుతోచడం లేదు. 

Onion Price: రైతు కంట కన్నీరు.. భారీగా పడిపోయిన ఉల్లి ధర.. కిలో రూ.3 అమ్మకం
Onion Price Fall Down
Surya Kala
|

Updated on: Feb 01, 2024 | 8:07 AM

Share

కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నచందంగా ఉంటుంది అన్నదాత పరిస్థితి.. ఆరుగాలం కష్టించి పని చేసి తీరా పంట చేతికి వచ్చిన తరువాత అమ్మాలని చూస్తే దానికి మార్కెట్ లో సరైన ధర లేక లబోదిబో అంటున్నాడు రైతు.. తాజాగా ఉల్లి ధర బాగా పడిపోయింది. కిలో రూ. 3, రూ.4 లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఉల్లి రైతు కంట కన్నీరు పెడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్న రైతు తీవ్ర కరువు ఉన్నా రైతులు ఉల్లిని సాగు చేశారు. మంచి ధర లభిస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే ఇప్పుడు ధర తగ్గింది. దీంతో రైతులు ఉల్లిని విక్రయించకుండా రెండు రోజులుగా మంచి ధరల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.3-4 పలుకుతోంది.

ఉల్లి ధరలు భారీగా పతనం కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కిలో ఉల్లి రూ.2లకు పడిపోయింది. దీంతో రైతులు పంటకు పెట్టిన పెట్టుబడి మాట అటు ఉంచి మార్కెట్ కు తరలించిన రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. వాస్తవంగా కొన్ని నెలల క్రితం వరకూ ఉల్లి ధర బాగానే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఉల్లి ధర నెల చూపులు చూస్తూ.. ఇప్పుడు అకస్మాత్తుగా రెండు రూపాయలకు పడిపోయింది. దీంతో రైతుకు దిక్కుతోచడం లేదు.

కర్ణాటక లోని దావణగెరె జిల్లాకు చెందిన రైతులు ఉల్లిని అధికంగా పండించగా వాటిని విక్రయించేందుకు ఏపీఎంసీ మార్కెట్‌కు తరలివచ్చారు. ఒక్కరోజే ఆరువేల బస్తాల ఉల్లి మార్కెట్‌కు వచ్చింది. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.3-4 పలుకుతోంది. ఉంది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఉల్లి అమ్మితే లారీ అద్దె వచ్చినా చాలు అంటూ వాపోతున్నారు. ధర పెరుగుతుందని రైతులు గత 2-3 రోజులుగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఉల్లి ధర క్వింటాల్‌కు 1500 రూపాయలు. ఉత్తమ దత్త ఉల్లిపాయ ధర రూ. 1200 నుంచి రూ. 1400 ఉంది ఎగువ మందం రూ. 1000 నుంచి రూ. 1100 ఉంది. మీడియం సైజు ఉల్లి ధర రూ. 700 నుంచి రూ. 800 ఉండగా చిన్న సైజు ఉల్లి ధర రూ. 300 నుంచి రూ. 400 ఉంది.

ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిలిపివేయడంతో ఉల్లి ధరలు బాగా పడిపోయాయంటూ రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మార్కెట్ లో ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగని నేపధ్యంలో రైతులు గ్రామాల్లో ఉల్లిని విక్రయించేందుకు వెళ్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..