Telangana: టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.. ఆరోపణలు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చిన ఆమాత్య..

Telangana: విద్యుత్ సంస్థల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Telangana: టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.. ఆరోపణలు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చిన ఆమాత్య..
Jagadish Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 26, 2021 | 9:38 PM

Telangana: విద్యుత్ సంస్థల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన ఆరోపణలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డివి చిల్లర మాటలు, చిల్లర రాజకీయం అంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేదు కానీ.. బయట మాత్రం సొల్లు కబర్లు చెబుతున్నారంటూ నిప్పులు చెరిగారు. ఒక రాజకీయ పార్టీని నడిపే నాయకుడు విజ్ఞతతో బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఆదరణను చూసి తట్టుకోలేక కొంత మంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విపక్ష నేతలపై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ విజయోత్సవ సభ తర్వాత కాంగ్రెస్ నేతలకు ఒక్కొక్కరికి పిచ్చి పడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఎలా వచ్చిందో ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలే రేవంత్ ను లీడర్ గా గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. పెద్దలను విమర్శిస్తే పెద్దలు ఐపోరని, వారిని అనుకరిస్తేనే పెద్దలు అవుతారని హితవు చెప్పారు.

Also read:

Fire Accident: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం.. మరో పది మంది..

Trending Video: SA vs WI మ్యాచ్‌లో తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు తప్పించుకున్న పాక్ అంపైర్.. వైరలవుతోన్న వీడియో..!

Viral Video: ఈ వీడియో చూస్తే మీ పెంపుడు కుక్కతో అస్సలు జోక్ చేయరు.. ఎందుకో తెలుసా..