AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ వీడియో చూస్తే మీ పెంపుడు కుక్కతో అస్సలు జోక్ చేయరు.. ఎందుకో తెలుసా..

పెంపుడు జంతువులతో చాలా సరదాగా గడపడం మనం తరచుగా చూసి ఉంటారు. కొన్నిసార్లు జంతువులు కూడా ఈ వినోదాన్ని చాలా సారధాగా తీసుకుంటాయి.. కానీ..

Viral Video: ఈ వీడియో చూస్తే మీ పెంపుడు కుక్కతో అస్సలు జోక్ చేయరు.. ఎందుకో తెలుసా..
Dog
Sanjay Kasula
|

Updated on: Oct 26, 2021 | 9:23 PM

Share

పెంపుడు జంతువులతో చాలా సరదాగా గడపడం మనం తరచుగా చూసి ఉంటారు. కొన్నిసార్లు జంతువులు కూడా ఈ వినోదాన్ని చాలా సారధాగా తీసుకుంటాయి.. కానీ కొన్నిసార్లు వాటి మానసిక స్థితి సరిగా లేనప్పుడు వాటితో జోక్ చేయడం యమ డేంజర్‌గా మారుతుంది. ఈరోజుల్లో కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలని .. సరదాగా గడిపే ముందు వందసార్లు ఆలోచిస్తారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటూ కనిపిస్తాడు. దానిని ఆటపట్టించేందుకు ట్రై చేస్తుంటాడు. తన చేతి వేలితో కొన్ని సింబల్స్ చూపిస్తూ దాని కోపాన్నిపరీక్షిస్తుంటాడు. అతను వారి ముందు తన పిడికిలిని పదేపదే తెరిచి మూసివేస్తాడు.

అతను కొన్నిసార్లు తన చూపుడు వేలును.. కొన్నిసార్లు తన బొటనవేలును చూపుతూ తన కుక్కను ఆటపట్టిస్తాడు. వ్యక్తి మధ్య వేలును కుక్క వైపు చూపిన వెంటనే అది కారిచేస్తుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఓ యూజర్ ఇలా కామెంట్ చేశాడు.’తదుపరిసారి ఈ వ్యక్తి కుక్కలను ఆటపట్టించే ముందు వందసార్లు ఆలోచిస్తాడు.’  చాలా మంది యూజర్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు.

మీ సమాచారం కోసం, hepgul5 అనే ఖాతా ద్వారా ఈ ఫన్నీ వీడియో Instagramలో  షేర్ చేయబడింది. ఈ వీడియోకు చాలా ఫన్నీ క్యాప్షన్ పెట్టాడు.

ఇవి కూడా చదవండి: Kid Safety: బైక్‌పై పిల్లలను తీసుకెళ్తున్నారా.. నియమాలు తెలియకపోతే బుక్కైనట్లే..

EPFO Alert: PF ఖాతాదారులకు ముఖ్య సూచన.. ఇంట్లో కూర్చుని మీ UAN నంబర్ తెలుసుకోవచ్చు.. అది ఎలాగంటే..