Trending Video: SA vs WI మ్యాచ్‌లో తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు తప్పించుకున్న పాక్ అంపైర్.. వైరలవుతోన్న వీడియో..!

SA vs WI: వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్ ఒక బంతికి రెండుసార్లు తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

Trending Video: SA vs WI మ్యాచ్‌లో తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు తప్పించుకున్న పాక్ అంపైర్.. వైరలవుతోన్న వీడియో..!
T20 World Cup 2021, Sa Vs Wi
Follow us
Venkata Chari

|

Updated on: Oct 26, 2021 | 9:27 PM

T20 World Cup 2021, SA vs WI: 2021 టీ20 ప్రపంచకప్‌లో 18వ మ్యాచ్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ టీంల మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ పెను ప్రమాదం తప్పింది. దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరిస్తున్న పాక్ అంపైర్ అలీమ్ దార్ 2 సార్లు తీవ్ర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అది కూడా ఒక బంతికి అవ్వడంతో అంతా షాకయ్యారు. అయితే ప్రమాదమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రిటోరియస్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్ బలమైన షాట్ ఆడాడు. బంతి అంపైర్ అలీమ్ దార్ వైపు వేగంగా వచ్చింది. కానీ, అతను చాలా స్పందించి తప్పుకున్నాడు. దీంతో అలీమ్ దార్ కింద పడిపోయాడు. అనంతరం వెనుక నుంచి అంపైర్ వైపు మరో పదునైన త్రో వచ్చింది. అలీమ్ దార్ మరోసారి తప్పించుకున్నాడు. ఈ త్రోను దక్షిణాఫ్రికా ఆటగాడు రాసి వాన్ డెర్ దుసాన్ విసిరాడు. క్యాచ్ తీసుకున్న తర్వాత, దుసాన్ బౌలర్ వైపు చాలా వేగంగా త్రో విసిరాడు. తృటిలో అంపైర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఇద్దరిలో ఒకరు అలీమ్ దార్ తలపై బంతిని కొట్టినట్లయితే పెద్ద ప్రమాదం జరిగేదే.

దక్షిణాఫ్రికాకు తొలి విజయం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో దక్షిణాఫ్రికాకు ఇదే తొలి విజయం. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో వెస్టిండీస్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 143 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యాన్ని చేరుకోవడంలో దక్షిణాఫ్రికాకు ఎలాంటి ఇబ్బంది పడలేదు. రీజా హెండ్రిక్స్ 39 పరుగులు, వాన్ డెర్ దుసాన్ 43, ఐడెన్ మార్క్రమ్ అజేయంగా 51 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 1 వికెట్ తీసిన ఎన్రిక్ నార్సియా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

అగ్రస్థానంలో ఇంగ్లండ్.. గ్రూప్ 1లో ఇంగ్లండ్ జట్టు మెరుగైన నెట్ రన్ రేట్‌తో నంబర్ 1 స్థానంలో నిలిచింది. శ్రీలంక రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. తొలి విజయంతో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లు ఇంతవరకు గెలవలేదు. పాయింట్ల పట్టికలో ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి.

Also Read: T20 World Cup 2021: గుడ్ ‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. కివీస్‌తో పోరుకు ఆ బ్యాట్స్‌మెన్ సిద్ధం..!

T20 World Cup 2021: ప్రమాదంలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కెరీర్.. చర్యలకు సిద్ధమైన బోర్డు.. ఎందుకంటే?