T20 World Cup 2021: ప్రమాదంలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కెరీర్.. చర్యలకు సిద్ధమైన బోర్డు.. ఎందుకంటే?

క్వింటన్ డి కాక్‌పై దక్షిణాఫ్రికా బోర్డు ఆగ్రహంతో ఉంది. జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చల తర్వాత అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

T20 World Cup 2021: ప్రమాదంలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కెరీర్.. చర్యలకు సిద్ధమైన బోర్డు.. ఎందుకంటే?
Quinton De Kock
Follow us

|

Updated on: Oct 26, 2021 | 7:47 PM

Quinton de Kock: టీ20 ప్రపంచకప్ 2021లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడని దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డికాక్‌పై భారీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, క్వింటన్ డి కాక్‌పై దక్షిణాఫ్రికా బోర్డు ఆగ్రహంతో ఉంది. జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చల తర్వాత అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడేందుకు క్వింటన్ డి కాక్ నిరాకరించాడు. ఎందుకంటే జాతివివక్షకు వ్యతిరేకంగా మ్యాచుకు ముందు మోకరిల్లడం తనకు ఇష్టం లేకపోవడంతోనే ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడనే వార్తలు వస్తున్నాయి.

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం నాడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు మద్దతు ప్రకటించింది. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ మోకాళ్లపై కూర్చోవాలని బోర్డు నిబంధన విధించింది. డి కాక్ బహుశా ఈ నిర్ణయంతో సంతోషంగా లేడు. వెస్టిండీస్‌ మ్యాచులో అలా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా బోర్డు కూడా ధృవీకరించింది.

డికాక్‌పై చర్యలు తీసుకుంటారా? క్వింటన్ డి కాక్ చర్యతో, అతనిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. కాగా, డికాక్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి నివేదిక కోరతామని, దాని ఆధారంగా తదుపరి చర్య తీసుకుంటామని క్రికెట్ సౌతాఫ్రికా ఒక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లలో కూడా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు మోకాళ్లపై కూర్చుంటారని దక్షిణాఫ్రికా బోర్డు తెలిపింది. అయితే ఆ మ్యాచ్‌ల్లో కూడా డి కాక్ ఆడకుండా ఉంటాడా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.

ప్రమాదంలో డికాక్ అంతర్జాతీయ కెరీర్! ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్విట్టర్‌లో డికాక్ సమస్యపై తన స్పందనను వ్యక్తం చేశారు. డికాక్ ఎప్పుడూ దక్షిణాఫ్రికా జట్టుకు ఆడకపోయినా తాను ఆశ్చర్యపోనని హర్షా భోగ్లే చెప్పాడు. హర్షా భోగ్లే ట్వీట్ చేస్తూ, ‘డికాక్ సమస్య ఇంకా ముగియలేదు. దక్షిణాఫ్రికా జెర్సీలో డి కాక్‌ని మనం చూడకపోతే నేను ఆశ్చర్యపోనవసరం లేదు’ అని ట్వీట చేశాడు.

Also Read: PAK vs NZ, T20 World Cup 2021: టాస్ గెలిచిన పాకిస్తాన్.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?

SA vs WI, T20 World Cup 2021: డిపెండింగ్ ఛాంపియన్లకు మరోషాక్.. 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం..!