Karimnagar: అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడేందుకు ఓ యువకుడి చిరు యత్నం.. ఇంటినే పిచ్చుకలకు ఆవాసంగా మార్చిన వైనం
Karimnagar: పల్లెలు... పట్టణాల్లో సెల్‌ఫోన్ల(Cell Phones) వినియోగం పెరిగిపోవడం వల్ల పక్షిజాతి మనుగడ ప్రశ్నార్థకమైంది. సెల్‌ఫోన్ తరంగాల(cell phone radiation ) వల్ల పిచ్చుకలు గతి తప్పి.. గమ్యాన్ని..
Karimnagar: పల్లెలు… పట్టణాల్లో సెల్‌ఫోన్ల(Cell Phones) వినియోగం పెరిగిపోవడం వల్ల పక్షిజాతి మనుగడ ప్రశ్నార్థకమైంది. సెల్‌ఫోన్ తరంగాల(cell phone radiation ) వల్ల పిచ్చుకలు గతి తప్పి.. గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. విశాల ప్రపంచంలో బతకే దారిలేక పిట్టలు రాలిపోతున్నాయి. పిచ్చుక కష్టాన్ని చూసిన ఓ పక్షి ప్రేమికుడు చలించిపోయాడు. పిచ్చుకలకు బతుకునివ్వడానికి తన వంతుగా ఓ ఆలోచన చేశాడు. అతడి ప్రయత్నం ఎన్నో పక్షులకు వరంగా మారింది.
కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన అనంతుల రమేశ్ అనే యువకుడు పిచ్చుకల మనుగడ కోసం ఓ సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టాడు..ఎలాగైనా సరే వాటిని కాపాడాలనుకొని ఓ నిర్ణయానికి వచ్చాడు. వాటికి ఇష్టమైన ఆహారం, అనుకూలంగా ఉండే వాతావరణం కల్పించాడు. గూడు కోసం గడ్డి, తినేందుకు గింజల ఏర్పాటు చేశాడు. తన ఇంటి వద్దే పిచ్చుకల కోసం అవసరమైన గింజలు, నీరు, వరి గొలుసులను ఏర్పాటు చేసి, ఆ పిచ్చుకలు గూళ్లు కట్టుకోవడానికి వీలుగా గడ్డిని అందుబాటులో ఉంచాడు. పక్షులకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరకడం వల్ల అక్కడకు వచ్చే పక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతరించి పోతున్న పిచ్చుకలను కాపాడేందుకు నేనో చిరు ప్రయత్నం చేస్తున్నాను. మొదట్లో ఒకటి రెండు పక్షులు మాత్రమే వచ్చేవి. కానీ ప్రస్తుతం వాటి సంఖ్య చాలా పెరిగింది. రోజూ ఉదయం పిచ్చుకల గుంపు చూస్తే… చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందని రమేశ్ ఎంతో సంతోషంగా చెబుతున్నాడు..
పిచ్చుకలు ఎక్కువగా రావడం గమనించిన రమేశ్… మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ఖాళీ నూనె డబ్బా తీసుకొని నాలుగు వైపులా కట్ చేశాడు. ఈ నాలుగు కొసలను కొంచెం వంచి అందులో గింజలు వేశాడు. మధ్యలో నీరు పోసి పక్షుల దాహం తీర్చేందుకు వీలుగా ఏర్పాటు చేశాడు. నాలుగు పక్షులూ నాలుగు వైపుల నుంచీ ఒకే సారి ఆకలి తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నాడు. ఇవి ఏర్పాటు చేసినప్పటి నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. పిచ్చుకలను కాపాడేందుకు నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో తన కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారని చెప్పాడు.
Also Read:
Janasena: సంక్షేమ పాలన అంటే ఇదేనా.. జగన్ సర్కార్‌పై జనసేన విమర్శనాస్త్రాలు
Elephants: మనుషుల్లా ఒంటరి తనాన్ని ఇష్టపడని ఏనుగులు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి