- Telugu News Photo Gallery World photos Even elephants hate being lonely! Solitary animals show more signs of STRESS than those in a group
Elephants: మనుషుల్లా ఒంటరి తనాన్ని ఇష్టపడని ఏనుగులు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి
Elephants: ఏనుగు ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి పెద్దది. అంతేకాదు ఏనుగుని హిందువులు వివిధ రకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాకాహారులు, బాగా తెలివైనవి. అంతేకాదు ఏనుగుకి మానవజీవితానికి అతి దగ్గర సంబంధం ఉంది. తాజాగా కొంతమంది పరిశోధకులు ఏనుగుల జీవన విధానం పై అనేక పరిశోధనలు చేశారు.
Updated on: Mar 21, 2022 | 12:45 PM

మనుషుల ఆలోచనా తీరుకి, జీవన విధానికి దగ్గరగా ఉంటుంది ఏనుగుల జీవన విధానం. ఏనుగులు కూడా ఒంటరితనంలో బతకడానికి ఇష్టపడవు. అవి కూడా నిరాశ, చంచలత్వాన్ని కలిగి యుఞ్జటాయి. మగ, ఆడ ఏనుగులు కూడా ఒత్తిడితో బాధపడతాయి. అయితే ఈ ఒత్తిడి ఇద్దరిలోనూ భిన్నంగా ఉంటుంది. ఫిన్‌లాండ్‌లోని టర్కు యూనివర్శిటీ పరిశోధకులు తమ ఇటీవలి ఏనుగులపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో ఏనుగుల గురించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి.

ఏనుగుల్లో ఒత్తిడి, అశాంతి, నిస్పృహలకు కారణమేమిటో తెలుసుకునేందుకు ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు మయన్మార్ ఏనుగులపై పరిశోధనలు చేశారు. ఆసియా ఏనుగులపై చేసిన పరిశోధన ప్రకారం వాటి పరిస్థితిని తెలుసుకోవడానికి వాటి మూలాల్ని పరిశీలించారు. మలాన్ని పరిశీలించారు. మలంలోని ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తనిఖీ చేశారు.

మగ, ఆడ ఏనుగుల్లో ఒత్తిడి పెరగడానికి కారణం కూడా భిన్నంగా ఉంటుందని పరిశోధన నివేదిక చెబుతోంది. ఉదాహరణకు, మగ ఏనుగులలో ఒత్తిడికి ఒంటరితనం అతిపెద్ద కారణం. అదే సమయంలో, ఆడ ఏనుగు బిడ్దకు జన్మనిచ్చే సమయంలో లేదా బిడ్డ పుట్టిన తర్వాత ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఏనుగులు ఒత్తిడికి లోనైనప్పుడు వాటి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

95 ఏనుగులపై చేసిన పరిశోధనలో మనుషుల మాదిరిగానే ఏనుగులు కూడా స్నేహితులతో గడపడాన్ని ఇష్టపడతాయని, ఫ్రెండ్స్ తో ఆనందంగా గడుపుతాయని తమ పరిశోధనలో తేలిందని పరిశోధకుడు డాక్టర్ మార్టిన్ సెల్ట్‌మన్ చెప్పారు. స్నేహితులు లేని ఏనుగుల మలంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అదే సమయంలో ఏనుగులు గుంపుగా ఆడుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని గుర్తించారు.

మనుషుల్లాగే ఏనుగుల్లో సామాజిక బంధానికి ఉన్న ప్రాముఖ్యత తక్కువేమీ కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇటువంటి పరిశోధన ఫలితాలు జంతువుల జీవితాలను మెరుగుపరచడానికి పని చేస్తాయని అంటున్నారు.




