Hyderabad: ఓయో రూమ్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు, ఈ చర్యలు తప్పనిసరి అని సూచన

హోటల్ కు వచ్చే ప్రతి ఒక్కరి ఐడి ప్రూఫ్ చెక్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. హోటల్ కి వచ్చేవారు తప్పనిసరిగా ఐడి ప్రూఫ్ చూపించే విధంగా నిబంధనలు పాటించాలని కోరారు. సీసీటీవీ పర్యవేక్షణ: హోటళ్లు తమ సీసీటీవీ ఫుటేజీ నిల్వను 90 రోజులు మించి ఉంచాలి. ప్రతి వారం లేదా నెలలో ఒక్కసారైనా ఈ సీసీటీవీ వ్యవస్థల పనితీరుని పరిశీలించాల్సి ఉంటుంది.

Hyderabad: ఓయో రూమ్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు, ఈ చర్యలు తప్పనిసరి అని సూచన
Oyo Hotels
Follow us

| Edited By: Surya Kala

Updated on: Sep 02, 2024 | 8:16 PM

ఓయో రూమ్ నిర్వాహకులతో తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ డిజి శికా గోయల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న ఓయో రూంల నిర్వహణ తీరు, తదితర అంశాలపై పలువురు హోటల్స్ నిర్వహణతో పోలీసులు భేటీ అయ్యారు. మహిళల భద్రతకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సమావేశంలో ఓయో రూమ్ నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు.

ఐడి ప్రూఫ్ వెరిఫై: హోటల్ కు వచ్చే ప్రతి ఒక్కరి ఐడి ప్రూఫ్ చెక్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. హోటల్ కి వచ్చేవారు తప్పనిసరిగా ఐడి ప్రూఫ్ చూపించే విధంగా నిబంధనలు పాటించాలని కోరారు.

సీసీటీవీ పర్యవేక్షణ: హోటళ్లు తమ సీసీటీవీ ఫుటేజీ నిల్వను 90 రోజులు మించి ఉంచాలి. ప్రతి వారం లేదా నెలలో ఒక్కసారైనా ఈ సీసీటీవీ వ్యవస్థల పనితీరుని పరిశీలించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అత్యవసర ప్రోటోకాల్స్: హోటల్ గదులు, రిసెప్షన్ ప్రాంతాల్లో అత్యవసర టెలిఫోన్ నెంబర్లు, అందుబాటులో ఉంచాలి. Dial 100” వంటి అత్యవసర సేవల కోసం ఉపయోగపడతాయి.

సిబ్బంది శిక్షణ: హోటల్ సిబ్బంది మహిళల భద్రతకు సంబంధించిన విధానాలపై సకాలంలో శిక్షణ పొందాలి.

మహిళల భద్రత: హోటళ్లు మహిళా అతిథులకు ప్రత్యేక భద్రతా సదుపాయాలు అందించడానికి ప్రోత్సహించబడతాయి. ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు ఉండకూడదని, ఉంటే హోటల్ మేనేజ్మెంట్ వెంటనే సమాచారం ఇవ్వాలని నిర్ణయించబడింది.

డిజిటల్ భద్రతా సూచనలు: హోటల్ బుకింగ్ సమయంలో ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా అతిథులకు భద్రతా సూచనలు పంపించబడతాయి.

ఈ విధానం, తెలంగాణలోని హోటళ్లలో సురక్షిత వాతావరణం సృష్టించడానికి, వారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి రూపొందించబడింది. మహిళల భద్రతా విభాగం, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి, ఈ మార్గదర్శకాల అమలు మరియు సమీక్ష చేయడానికి పనిచేస్తుంది. ఈ సమావేశానికి హైదరాబాదులోని వివిధ ఓయో రూమ్స్ నిర్వాహకుల ప్రతినిధులు హాజరయ్యారు. వీరితోపాటు యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..