AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఈ వేలికి బంగారం ఉంగరాన్ని పెట్టుకుంటున్నారా… కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే..

జ్యోతిష్య ప్రయోజనాలు పొందడానికి బంగారు ఉంగరాన్ని ధరించడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. అయితే బంగారు ఉంగరాన్ని ఏ చేతికి ధరించడం సరైనదో తెలియదు. అప్పుడు తప్పు వేలికి ఉంగరాన్ని ధరిస్తారు. ఇలా చేయడం వల్ల లాభానికి బదులు నష్టాలు మొదలవుతాయి. జీవితంలో ప్రయోజనాల గురించి ఆసక్తి ఉంటే బంగారు ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో? ఈ రోజు తెలుసుకుందాం.. బంగారు ఉంగరాన్ని ఏ వేలికి ధరించకూడదో కూడా తెలుసుకుందాం..

Astro Tips: ఈ వేలికి బంగారం ఉంగరాన్ని పెట్టుకుంటున్నారా... కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే..
Golden Ring
Surya Kala
|

Updated on: Sep 02, 2024 | 8:03 PM

Share

చాలా మంది తమ జీవితంలో ధైర్యంగా అడుగులు వేయడానికి ఇష్టపడతారు. అలాంటి వారు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. కొన్ని సార్లు జ్యోతిష్యం సహాయం తీసుకుంటారు. జ్యోతిషశాస్త్రంలో వ్యక్తి గ్రహం, నక్షత్రరాశి వంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి. దీనిని స్వీకరించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చాలా మంది జ్యోతిష్యం నివారణలను కూడా అవలంబిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు సరిగ్గా అవలంబిస్తున్న నివారణ చర్యల కోసం ఈ చర్యల్లో దేనినైనా అవలంబిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం.

జ్యోతిష్య ప్రయోజనాలు పొందడానికి బంగారు ఉంగరాన్ని ధరించడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. అయితే బంగారు ఉంగరాన్ని ఏ చేతికి ధరించడం సరైనదో తెలియదు. అప్పుడు తప్పు వేలికి ఉంగరాన్ని ధరిస్తారు. ఇలా చేయడం వల్ల లాభానికి బదులు నష్టాలు మొదలవుతాయి. జీవితంలో ప్రయోజనాల గురించి ఆసక్తి ఉంటే బంగారు ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో? ఈ రోజు తెలుసుకుందాం.. బంగారు ఉంగరాన్ని ఏ వేలికి ధరించకూడదో కూడా తెలుసుకుందాం..

బంగారు ఉంగరం ఎందుకు ధరించాలి?

హిందూ మతంలో బంగారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. బంగారం శుభ కార్యాలకు, పండగలు, వివాహంలో బంగారాన్ని ఉపయోగిస్తారు. ప్రజలు బంగారాన్ని అలంకారానికి ఉపయోగిస్తారు. బంగారం లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది. బంగారం ఇంటికి చాలా ఆనందం, శ్రేయస్సును తెస్తుందని చెబుతారు. బంగారం కూడా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. బంగారాన్ని ధరించడం వల్ల సూర్యుని శక్తి పెరుగుతుంది. జీవితంలో శుభ యోగాన్ని సృష్టించడం ప్రారంభిస్తుంది అనే నమ్మకం ఉంది. బంగారాన్ని ధరించడం వల్ల మనిషి జీవితంలో ధైర్యాన్ని, స్తైర్యాన్ని కూడా పెంచుతుంది. కనుక జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారు బంగారం ధరించమని జ్యోతిష్యులు సలహా ఇస్తారు. బంగారం ధరించడం వలన శరీరం, మనస్సుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది వ్యక్తి శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

బంగారు ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలంటే

ఎవరి జీవితంలోనైనా నిరంతరం సమస్యలు కొనసాగుతున్నా, ఎంత కాలమైనా లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడక పోయినా బంగారు ఉంగరాన్ని ధరించాలి. అప్పుడు ఉంగరపు వేలికి బంగారు ఉంగరాన్ని ధరించవచ్చు. ఉంగరపు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరంలోని రెండు ఉంగరపు వేళ్ల సిరలు గుండెకు కనెక్ట్ అవుతాయని చాలా మంది నమ్ముతారు. అందువల్ల బంగారు ఉంగరాన్ని ఎల్లప్పుడూ ఉంగరపు వేలుకు ధరించాలని నమ్ముతారు. నిశ్చితార్థం సమయంలో కూడా బంగారు ఉంగరాలను ఉంగరపు వేలుకు మాత్రమే ధరిస్తారు. అంతేకాదు చిటికెన వేలుకు బంగారు ఉంగరాన్ని కూడా ధరించవచ్చు.

బంగారు ఉంగరాన్ని ఏ వేలిలో ధరించకూడదంటే

మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించడం అశుభం. బంగారు ఉంగరాన్ని ఎప్పుడూ మధ్య వేలుకు ధరింరాదు. ఇలా చేయడం వలన దుష్ప్రభావాలు ఏర్పడతాయి. ఇది శని గ్రహానికి సంబంధించిన వేలు. కనుక ఈ వేలుకి బంగారు ఉంగరాన్ని ధరిస్తే.. సొంత కాలుని మీరే గొడ్డలితో నరుక్కున్నట్లే. ఎందుకంటే ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడడానికి పరిస్థితులు ఏర్పడతాయి. డబ్బుకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కనుక మధ్య వేలికి బంగారు ఉంగరాన్ని ధరించరాదు.

బొటనవేలుకి దరించవచ్చా

ఉంగరం బొటనవేలుకి ఎవరో కాని ఉంగరాన్ని ధరించరు. అయితే బొటన వేలు చంద్రుడిని సూచిస్తుంది. మీకు బొటన వేలుకి ఉంగరం ధరించడం ఇష్టం అయితే ఈ వేలికి బంగార ఉంగరానికి బదులుగా వెండి ఉంగరాన్ని ఉపయోగించండి. అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.