Vinayaka Chavithi: వినాయక చవితి సందర్భంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక ఉత్సవాలు.. గణపతి హోమంలో పాల్గొనాలంటే ఇలా చేయండి..
పవిత్ర స్వర్గధామం కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ రుద్రాభిషేకం, సమూహిక మహా గణపతి హోమం, అన్న వితరణ, గో సేవ, పౌర్ణమి పూజ, సుదర్శన హోమం వంటి అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ నెలలో వినాయక చవితి పర్వదినం రానుంది.
శ్రీ ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు అందిస్తోంది ఆదిశంకర మఠం. దేశంలో అనేక ప్రాంతాల్లో శ్రీ ఆదిశంకరాచార్య మఠాలున్నాయి. వాటిల్లో ఒకటి తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో బొలారంలో కౌకూర్ గ్రామంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠం. ఇది శ్రీ ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మికతను, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తుంది. ఈ పవిత్ర స్వర్గధామం కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ రుద్రాభిషేకం, సమూహిక మహా గణపతి హోమం, అన్న వితరణ, గో సేవ, పౌర్ణమి పూజ, సుదర్శన హోమం వంటి అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ నెలలో వినాయక చవితి పర్వదినం రానుంది.
వినాయక చవితి పండగ సందర్భంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో సెప్టెంబర్ 7న ఉదయం 6 గం.టలకు మహాగణపతి హోమాన్ని నిర్వహించనున్నారు. వినాయక చవితి సందర్భంగా నిర్వహించనున్న ఈ గణపతి హోమం కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని దైవానుగ్రహ పాత్రులు కావాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు. గణపతి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహా గణపతి హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. హోమం అనంతరం అన్న వితరణ ఉండనుందని తెలిపారు. గణపతి హోమంలో పాల్గోనాలనుకునే భక్తులు పేరు నమోదు చేసుకోవడానికి ఈ లింక్‌ని క్లిక్ చేయండి. https://kaladyshankaramadomts.org/index.php/worldline/booking. భక్తుల సౌకర్యార్ధం ఈ హోమం గురించి ఏమైనా ఇతర వివరాలు.. లేదా సహాయం కావాలంటే 8350903080 కి ఫోన్ చేయవచ్చు అని శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య మహాసంస్థానం సిబ్బంది పేర్కొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి