Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆ దేశంలో పోనీ హెయిర్ స్టైల్ పై నిషేధం.. పోనీతో కనిపిస్తే గుండు కొట్టించడమే కాదు జైలు శిక్ష కూడా

దక్షిణాదిలో ప్రబలంగా ఉన్న ఫ్యాషన్ ట్రెండ్‌కు స్వస్తి పలకాలని కిమ్ జోంగ్ ఉన్ సంకల్పించారు. జీన్స్, డైడ్ హెయిర్, పొడవాటి జుట్టు, శరీరానికి అంటి పెట్టుకుని ఉండే ప్యాంటు, షోల్డర్ బ్యాగ్‌లతో పాటు దుస్తులు, బ్లౌజ్‌లపై సెమీ-ట్రాన్స్‌పరెంట్ స్లీవ్‌లు ఉత్తర కొరియాలో ఇప్పటికే నిషేధించారు. ఈ నిషేధం లిస్టులో ఇప్పుడు సరికొత్తగా పోనీ హెయిర్ స్టైల్ చేరుకుంది.

Viral News: ఆ దేశంలో పోనీ హెయిర్ స్టైల్ పై నిషేధం.. పోనీతో కనిపిస్తే గుండు కొట్టించడమే కాదు జైలు శిక్ష కూడా
Ponytail HairstyleImage Credit source: pexels
Follow us
Surya Kala

|

Updated on: Sep 02, 2024 | 4:19 PM

ప్రపంచంలో కొన్ని దేశాలు నియంతృత్వ కథలు వింటే గూస్‌బంప్‌లను ఇస్తాయి. నాటి హిట్లర్ ను తలపిస్తూ నియంతృత్వ కథలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా నేటి హిట్లర్ అంటూ ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్. ఇతని పేరు వినగానే ఎన్నో వింత వింత రూల్స్ వెంటనే గుర్తుకు వస్తాయి. నడి వీదులో నడిచేందుకు రూల్స్ అయినా పెట్టవచ్చు.. కంపోస్ట్ తయారీకి కుండీలను సేకరించే చట్టమైనా కావచ్చు లేదా పురుషుల బట్టలు, స్త్రీల కేశాలంకరణకు సంబంధించిన కండిషన్స్ అయినా కావచ్చు. ప్రస్తుతం అలాంటి ఒక రూల్ నెట్టింట్లో చర్చనీయాంశమైంది. దీని గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అసలు అలాంటి కండిషన్ కూడా పెట్టొచ్చాఅని కూడా ఆలోచిస్తారు.

పోనీటైల్ హెయిర్‌స్టైల్ అనేది ఆఫీసుకు లేదా కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు సరిగ్గా సరిపోయే హెయిర్ స్టైల్. ఎందుకంటే పోనీని వేసుకోవడం చాలా సులభం. అంతేకాదు ఈ హెయిర్‌స్టైల్ వయసు సంబంధం లేకుండా అందమైన రూపాన్ని కూడా ఇస్తుంది. అలాంటి ఈ హెయిర్ స్టైల్ ఇప్పుడు ఉత్తర కొరియాలో నిషేధించబడింది. ఈ విషయం తెలిసి ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. దక్షిణాదిలో ప్రబలంగా ఉన్న ఫ్యాషన్ ట్రెండ్‌కు స్వస్తి పలకాలని కిమ్ జోంగ్ ఉన్ సంకల్పించారు. జీన్స్, డైడ్ హెయిర్, పొడవాటి జుట్టు, శరీరానికి అంటి పెట్టుకుని ఉండే ప్యాంటు, షోల్డర్ బ్యాగ్‌లతో పాటు దుస్తులు, బ్లౌజ్‌లపై సెమీ-ట్రాన్స్‌పరెంట్ స్లీవ్‌లు ఉత్తర కొరియాలో ఇప్పటికే నిషేధించారు. ఈ నిషేధం లిస్టులో ఇప్పుడు సరికొత్తగా పోనీ హెయిర్ స్టైల్ చేరుకుంది.

పోనీటైల్ వేసుకుంటే ఏ శిక్ష పడుతుందంటే

ఎవరైనా పోనీటైల్‌తో పట్టుబడితే.. వారి జుట్టు షేవ్ చేస్తారు. అంటే ఆ అమ్మాయికి గుండు కొడతారు. అంతేకాదు 6 నెలల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది. నివేదిక ప్రకారం నియంత కిమ్ జోంగ్ ఉన్ తన పొరుగున ఉన్న దక్షిణ కొరియా ప్రజలు తమ జుట్టును ఈ స్టైల్‌లో ఎక్కువగా కనిపిస్తున్నారని… అందుకే ఇప్పుడు తమ దేశ ప్రజల విషయంలో ఈ ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంగ్ల వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం పారదర్శకమైన స్లీవ్‌లు, పోనీటైల్ సోషలిస్టు వ్యవస్థ ప్రతిష్టకు మచ్చ లాంటివి అని .. అంతేకాదు ఈ కొత్త నిబంధన ఇది దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా తీసుకువచ్చినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఉత్తర కొరియాలో ఈ వింత చట్టాల వల్ల జనజీవనం కష్టతరంగా మారడం గమనార్హం. అంతేకాదు ఇక్కడ ఆంక్షలు ఎంతవరకు ఉన్నాయి అంటే ఈ దేశానికి సంబంధించిన చాలా విషయాలు బయటకు రావు కూడా.. ఇక్కడ, తప్పులు చేసే వ్యక్తులను చాలా కఠినమైన చర్యల ద్వారా శిక్షిస్తారు కూడా..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..